Posts

Showing posts from April, 2025

పిట్ట కథ

 కులం , మతం,డబ్బు ,గబ్బు, జబ్బు బల్లమీద కూర్చుని , దమ్ము లాగుతున్నాయి  ప్రేమ , మైత్రి , దయ,  కరుణ చెత్త కుప్ప పక్కన గుడిసెలొ కూర్చుని మాట్లాడుకుంటున్నాయి  ప్రేమ : ఏంటి బ్రదర్ మనం స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకున్నా ఛీ తూ అంటారు , వాలేమో పాచి నోటితొ అత్తరువేసుకున్నా నవాబు బాబ్బాబు అంటారు  మైత్రి : అవును అన్న నాకు కూడా బోధపడలేదు . కాని ఒక సారి అలా వెళ్ళినపుడు విన్నా అన్న వాళ్లకి మన లాగ రక్తం లేదంట , ఏదో కొత్త పేరు చెప్పారన్న , (ఏంటబ్బా అని తలగోక్కుంటోంది ) నాలుక మీద ఉంది నోటి బైటికి రావట్లేదు అన్న  పక్కనుండి దయగాడు మొట్టికాయ వేసాడు  మైత్రి : ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది "రోగం " రోగం ఉంది అంట వాళ్లకి  దయ : రోగంమా అంటె ఏంట్రా?  మైత్రి : ఏమో అన్న నాకేం తెలుసు మొన్న సంతకి (సమాజంలోకి ) వెళ్ళినపుడు విన్న వాళ్లకి రోగం ఉందంట అది పడితే పోదంట అని , దయ : ఆబ్బ్బా అంత గట్టిదా అది ,మనకెందుకు లేదు తమ్ముడు అది  ప్రేమ : చాల్లెరా నీ ఆశ ,అవి రావడానికి మనకేం దమ్మిడీ...

తెలుగు

 మొదట పలికిన నా తెలుగు పలుకు చేనులో గాలికి మొక్కల కులుకు పువ్వుని ముద్దాడిన చిలక లోలుకు మాట్లాడుతుంటే చుక్కల మిణుకు సొగసైన పెద్ద బాల శిక్ష వ్యాకరణానికి శ్రీరామ రక్ష అందాల ఆటవెలది తేనె అద్దిన తేటగీతి చందమామను తలపించు చెంపకమాల ఉషోదయ వెలుగు వెలుతురులా ఉత్పలమాల వినసొంపైన సామెతల మోత ఉగాది పచ్చడిలొ మామిడి పూత ఒంపుల గుండ్రని రాత  కన్నులకు నిండు మేత తిక్కన పోతన నన్నయ తెలుగు సౌరభం కృష్ణదేవరాయ మా భాషా పితామహుడు రామ్మూర్తి మన గర్వం సత్యనారాయణ శాస్త్రి భర్తృహరి సుమతీ శతకం నూరేళ్ళకు మరువలేని సుభాషితం అల్లసాని పెద్దన్న,తిరుగులేని వేమన  శ్రీ శ్రీ , దాశరథి గురజాడ రొమ్ములు గుద్ది చెప్పు తెలుగువాడా నిత్య యవ్వన సిరుల మల్లి అందాల మా తెలుగు తల్లి

యెంకి పాట

 మామ చందమామ నాఎంకి యాడాపోయినది  నా మల్లి మళ్ళెప్పుడొస్తది, మొబ్బులో ముద్దేటి మత్తులొ తోసినాది  మళ్ళొస్తా అని పొద్దుపొద్దునే మాయమైనాది  ఎంకి యాడాపోయినవే ,మల్లి మళ్ళెప్పుడొస్తావే  మామ ...(1) గోదారల్లే నవ్వుతాది , పల్లె పాటల్లే మాట్లాడతాది , కృష్ణమ్మా ఒడ్డున అల్లుకున్న కొబ్బరి ఆకుల్లా జడేస్కుంటాది , నది నడిబొడ్డున సూరీడు పూసిన రంగుల్లా మెరుస్తాది , చంద్రయ్య నాయెంకిని చూసావా నువ్వు  మారేపల్లె మల్లిరా అది  మాపల్లె పాటల ఎంకిరా అది   సలవమజ్జిగ పులుపెక్కి పోయినదే  మల్లి ఓ ముద్దిచ్చిపోయే  మామ (1)... జాబిల్లి సిగ నుండి జారిన సన్న జాజిరా అది  సిగ్గేస్తే మబ్బుచాటుకెళ్లే ఎన్నెలమ్మర అది  సుక్కలో పెద్ద సుక్క, పక్కేసుకునే ఏల జంటకొచ్చే నెలవంక  చంద్రయ్య నామల్లిని చూసావా నువ్వు  సీకట్లో మినుకు రవ్వరా అది  సందెపొద్దున నవ్వే సంపంగిరా అది  కుండబువ్వ ఎండిపోయినాది ,మల్లి వచ్చి ముద్దెట్టిపోయే  ఎంకి యాడాపోయినావే , మల్లి మళ్ళెప్పుడొస్తావే

జై జవాన్ - జై కిసాన్

 నెత్తురొడ్డి ప్రాణం కాపాడేది సైన్యం చెమటోడ్చి కడుపు నింపేది సేద్యం పాలిచ్చిన రొమ్ముకే బువ్వ పెట్టావా రైతున్న పుట్టుకనిచ్చిన అమ్మకే రక్షణవైనవా సైనికన్న ఆకలేస్తే కానీ నిన్ను అనుకోను, ఆపదోస్తే కానీ నిన్ను తలుచుకోము తెలియనోల్లకి బంధువై బతుకునిచ్చార మీరు జై జవాన్ జై కిసాన్ బోలో జై జవాన్ జై కిసాన్ రక్తం మరిగేలా బోలో జై  జవాన్ జై కిసాన్ దిక్కులు దధ్చరిల్లెలా బోలో జై జవాన్ జై కిసాన్ పొలిమేర కాడ నాగలితో రైతన్న సరిహద్దు కాడ కాపలాగా జవానన్న బిచ్చగాడిలా బతుకుతవు, నువ్ బిచ్చమేస్తెనే మా బతుకు రైతన్న, కునుకు తీయవు,కన్ను మూయవు, కంటికి రెప్పలా కాస్తవు జవానన్న జై జవాన్ జై కిసాన్ బోలో జై జవాన్ జై కిసాన్ జోర్సే బోలో జై జవాన్ జై కిసాన్ జిందా హోనే తక బోలో జై జవాన్ జై కిసాన్ దేశమే మీ స్వార్థం, దేహమే మీ అస్త్రం, తీర్చలేని రుణం గుర్తు పెట్టుకుని ధన్యోస్మి అంటూ బతుకుతాం జై జవాన్ జై కిసాన్

జీవితం 2

 ఒంటరినెపుడు కాను నేను ఎవరికీ ఏమీ అవని బంధువును నేను దాహమైతె దోసిట్లో నీరుని దూరం అనుకుంటే అందని సెలయేరుని ఒంటరిని కానేపుడు ... గమ్యం లేని అనంతం గగనం కోరిక లేని నిరాడంబరం నా జీవితం సాయమే అందితే ధన్యోస్మి అనుకుంటా సమస్యే ఎదురైతే సవాలుగా ఎదురుకొంట ప్రశ్నలనె రెక్కలు తొడిగిన విహంగ గమనమిధి మరో ప్రయణంకై నిలిచిన మజిలీ నాది ఏకాకిని అసలే కాను... ఆలోచన చేయని చూపు పసిపాపది నిర్ధారణ తెలియని స్నేహం నాది నిగూఢ నిషబ్ధంలో స్వరాలను వింటున్న నిమగ్నమైన జీవితం నాది, కదపకంటున్న నిరీక్షణలకి వేచి చూడని అన్వేషణ నాది ఓటములేరుగని అనుభవం సారం ఇది ఒంటరిని కానెపుడు ఎకాకిని అసలేకాను శృష్టి లయను , ప్రకృతి లయను , అంతు చిక్కని మాయను

పల్లెటూరు

 సురీడు సురీడు ఏలాయెర ఈనాడు ఒరే సురీడు మా దేవుడు నువ్వు రాందే నిదుర లెగడురా మా బుజ్జాడు పెంట నీళ్లు జల్లే మాయమ్మ , అడుగు సూసి వెయ్యరో జాగ్రత్తరోయమ్మ గుడిసె ముందే ముగ్గుల ఆకాసం , రాతిరి ఒదిలిపాయిన సుక్కలతో గొబ్బిల్ల సింగారం శివుడికేమో గంగా జలం , మాకేమో కుంకుడి రసం పొయ్యి మీద ఏనీళ్లు , మా సిన్నోనికి నూరేళ్ళు  నాగలెత్తె నాగయ్య , బండి ఎత్తే బసవయ్య  ముస్తాబయ్యే సినయ్య, అల్లరి పిడుగులు సూడయ్య అలుపొచ్చిన అయ్యలకు రాగి ముద్ద , సెట్టు నీడ ఆకలేసిన అల్లరోల్లకు గోరు ముద్ద , అమ్మ తొడ ఇంటింటా ఇదే తీరు , మా పాణం మా ఊరు .......... సుర్రు సుర్రంటున్న ఎండల్లో, సల్ల సల్లగున్న బావి ఈతలు కడుపు నిండే దాకా తాటీ నుంజలు,అవి బండి కట్టి చేరువెంబట ఆటలు దూడ పిల్లనీనే మా పిన తల్లి , పెళ్లి ఈడుకొచ్చే పక్కింట్లో సెల్లి ఊరంతా పండగ పండగ,ఇంట్లో కూడెందుకు దండగ సైకిలెక్కొచే ఆకాశరామన్న, ఉత్తరాలు తెచ్చే నయన హరిలో రంగ హరి కత, యింటూ తోంగుంటిమి కదా ఓ పూట మామిడికాయలు, మరోచోట చింతకాయలు పండిన ఒడ్లే మా దుడ్లు, వాన మట్టి మా కనుగుడ్లు  రామ సక్కని సీత మా ఊరు, సూడ సక్కని పైరు మా ఊరు

జీవితం 1

 కన్నులకు చూపు తోడు కాదా చూపు లేకపోతే చీకటి నీ చెలిమి కదా దీపం వెలగాలి అన్న చీకటి ఉండాలి కదా ఎపుడూ అనుకోకు నువ్వు ఒంటరి అని.... చ 1.. ఎంత ఒడిసిపట్టినా బరువనుకోని బాధ్యత తత్వం భూమిది ఎంత ధారపోసినా తరగదనుకునే త్యాగ గుణం మేఘానిది బాధలు చెప్పుకోని స్నేహం ఇరువురిది సంతోషాలు పెంచుకునే అనుబంధం అది చ 2.. దారి తప్పిన ధారకు తనువును సైతం పణంగా పెడుతుంది మట్టి కాళ్లు లేక కదలిక తెలియని ఆకుకి నాట్యం నేర్పిస్తుంది పవనమే  మాటైనా చెప్పకపోయినా చేసిన సాయం ఒకరిది క్షణమైనా పరిచయం అవసరంలేని స్నేహం మరొకరిది కన్నులకు....

జీవితం

 తీరమన్నది లేని పవన సాగరం ఈ విశ్వం స్వార్థంమన్నది చోటు లేక గడిపెయ్ ఈ జీవితం ఇందనమవసరమెరుగని ప్రయాణం అలుపెరుగక అనంతమై నిండిపో ఈ ప్రపంచం ......... కలిసే ప్రతి మనిషీ ఒక పాఠమేగా కాదని వెనుదిరిగితె ఓటమెగా, చెలిమి కోరి చేరువైన బంధం వరమేగా భారమని దూరమైతే నేరమేగా, సాయమడిగే చేతులన్నీ నిస్సహాయత కాదు ఆదుకున్న హృదయాలకేపుడు ఆపద రాదు సాగిపో నేస్తం , ఆగనీకు ప్రయత్నం  గెలుస్తే వెలుగౌతావు ,లేదా మహా అయితే చీకట్లో నిదరోతావు ....... కట్టిన ప్రతీ నావ ఒడ్డును చెరేందుకెగా ప్రమాదమని పడకేస్తే జన్మ స్థూలమేగా, చీమాచెట్టు అణువుఅంబరం తనలో భాగమేగా నేనెవరినని విత్తు పెరగక జీవం సవమేగా, సాధించేదేముంది జీవితంలో చేయూత తప్ప సంపదంటు ఏముంది పంచే ప్రేమేగా గొప్ప సాగిపో నేస్తం, విడువక సంకల్పం  సాధిస్తే ఉరెగుతావ్,లేదా మహా అయితే ఓడి ఉదాహరనౌతావ్

అనాథ నోట అనాది పాట

 కన్నవారిని దేవుళ్లు అంటారంటే  నన్ను కనిపాడేసిన మిమ్మల్ని ఏమనాలి  ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం  పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం  అమ్మ అనేది ప్రధమ పలుకేమో అందరికి  ఆకలి నా మొదటి అరుపు నా కడుపుకి  ఆదమరిచి ఆ ఒడిలో పడుకునే బాల్యం అందరిది  ఆప్యాయత మరిచి అడుక్కునే  బతుకు నాది  పాలతో నోరు తడుపుకోలేక, నీళ్లతొ  కళ్లు నింపుకున్న ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం  పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం  ......... అమ్మ చేతి నిండా నిండే ముద్ద ఒకటైన  తిందామనుకున్న  రూపాయి అయినా పట్టని నాచేయి చాచి రూపాయి కోసం నిలుచున్న  పొద్దుపొద్దునే ముద్దుపేరుతో ముద్దులిచ్చి నిద్రలేపుతుంది అమ్మ అనుకున్న  ఎండ తాకి, దుమ్ము సోకి, గతం విడిచి, గమ్యం మరిచి సాగుతున్న ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం  పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం

అందరి బంధువయ - ఆకాశ రామన్న

 ఇప్పుడంటే watsappulu, ఫేస్ బుక్కులు వచ్చాయి కానీ మా చిన్నపుడు అయితే మా పోస్ట్ మానే అన్ని. ఆఫీస్ కి వెళ్ళే వోళ్ళు పొద్దున్నే తినేసి ,మధ్యాహ్నం భోజనం డబ్బా తీసుకెళ్తారు కానీ మా పోస్ట్ మాన్ అలా కాదు. ఆయనకి డబ్బా అవసరం లేదు నీళ్ళ బాటిల్ అవసరం లేదు. తొక్కిన గడపలో మేతుకైన తినాల్సిందే లేక కనీసం టీ , కాపీ అయిన తగలాల్సిందే.  మనకి ఒక చుట్టరికం , కొన్ని వరసలు ఉంటాయి ఆయనకి అలా కాదు అన్ని చుట్టాలు ఆ సంచి లో వేసుకుంటాడు, అన్ని వరసల పిలుపులు వింటాడు, మా పిల్లకాయాలకి తాత ,కొంచం పెద్ద అబ్బాయిలకి బాబాయ్, మా అమ్మలకి తమ్ముడు ,నాన్నలకి బావ బామ్మర్ది , తోబుట్టువు తోడు అన్నీనూ. మా అవ్వలకి , అబ్బలకి కొడుకు వరస. మా అన్నకి ,బావ కి ఎవరికి ఉద్యోగం వచ్చినా ఆయన నోటెమ్మట రావాల్సిందే. ఏనకటికి కొత్తగా పెళ్ళైన ఎంకట లచ్చిమి మొదటి కాన్పుకి ఊరెళ్ళింది , బిడ్డని కనేసిందని ఊరంతా దండోరా ఏసి మరి చెప్పేశాడు. ఎన్ని పెళ్లి సంబంధాలు చుసాడో, ఎన్ని కొంపలకి తోరణాలు కట్టిండో లెక్క లేదు.  మా పక్కింటి బామ్మగారికి ఇంట్లో అన్ని ఆయనే. ఓ మిట్టమధ్యాహ్నం ఎండకి అలిసొస్తే అరేయ్ చవట ఆ మేహం మసికొట్టుకు పోయింది వచ్చి కాళ్ళు మొహం కడ...

రుధిర సిర

 ఈనిన మేక పిల్ల మొదటి సారి ఆకలేసి తాగుతున్న పాలంత కల్మషం లేని బావుకతతో నిండుగా ఉంది ఆలోచన తెల్లని రాళ్ల ఏడారిలా కర్కశంగా జాలి లేకుండా నిజం మాట్లాడుతోంది మనస్సు పదిహేను వందల డిగ్రీల ఉష్ణోగ్రతల వేడితో భైరగినై చేతిలో పట్టుకున్న గుండె కలం నుండి ఉడుకుతోంది లావాలాగ సిర ఆ వేడి సిరలో మునిగి కాలుతున్నా కరగనట్లు నిలుచున్నాడు కవి కాలుతున్న ప్రతి నరం, ఆవిరౌతున్న ప్రతి రక్తపు బొట్టు ఆకాశానికి చేతులు జాపి అడిగింది , భూమినంత గొంతుగా చేసుకుని అరిచింది  తన నిజానికి కుల జాతి నీతి బేదం లేని కత్తిలా వివక్ష లేకుండా ప్రతి హృదయాన్ని ఖండించే అక్షరాలు కావాలని

నవ్వించు వాడు వైద్యుడు

 పేరు కి శేష శైల వ్యాసుడి పేరు వెంకట్రావు పెట్టుకుని అందరికి హాస్య వసుడిగా ఉంది పోవాలని వెంకట్రావు ని కాస్త వెంగళరావు గా మార్చుకున్న ధీశాలి, హాస్యశీలి, నవ్వులశాలి. జ్వరం వచ్చిన, దగ్గు వచ్చిన నవ్వే ఆయనకి మిరియాల కషాయం , అల్లం రసం. ఎవరైనా కొత్తగా పరిచయం అయితే alov alov ఐయామ్ వెంగల్ వెల్కమ్ అంటూ నమస్కారం పెట్టేస్తాడు. వాళ్లు కాస్త ' పాపం ఆయనకి నాతి ఏమో వెల్కమ్ ని వోతి మరీ పలుకుతున్నాడు అనుకుంటారు.            ఈయన గారికి చావు అంటే ఒక పెద్ద చేలోక్తి, దాని గురించి మాట్లాడాలన్నా వినాలన్న, దాని మీద చేలోక్తి విసరాలన్న మహా చెడ్డ ప్రీతీ , ఆయనకి ఏదో తృప్తి. అంటే అయన చేలోతి అంటే చచ్చేంత ఇష్టం అని.  తన దగ్గర మనిషైనా గోవిందం కనిపిస్తే ' ఏమోయ్ గోవిందం నువ్ ఇప్పుడు హుటాహుటిగా టాప్ అని హరిమన్నవ్ అంటే ఏమంటారో చెప్పుకో అన్నాడు '     బిత్తర పోయిన గోవిందం ' పొద్దుపొద్దునే శుభమా అని సుబ్రభాత వేల ఈ చావు సన్నాయి ఏంటి నారాయణ. అయినా ఈయన నోటా మాట, వేటగాడి తూటా బైటికి రానిదే సంతోషించరు. వేరే గత్యంతరం లేక, చిత్తం సెల్వవివండి విని ఇక్...

పెళ్ళి పుస్తకం 1

 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా... వంశీ... కోనేటి రాయడా.. పొడగంటిమయ్యా మిమ్ము... వంశీ... టీ పెడుతూ పాడుకుంటున్న వంశీని గట్టిగా పిలిచింది దీపు. ఏంటి దీపు మన ఇంటి దేవుడు వంశీ వేంకటేశ్వరుడు నువ్వు అలా పొద్దున్నే పాచి నోటితో కీచు గొంతుతో పాడితే  దేవుడెం ఖర్మ ఇంట్లో ఉండే మనుషులే పోతారు. దీపు,,నాది పాచి నోరు కాదు ఇది కీచు గొంతు అంతకంటే కాదు. నేనెప్పుడో దంతధావనం కార్యక్రమం చేసేసా అదిగో closeup పేస్ట్ ad లొ లాగా నా సువాసన గాలిలొ తేలుతూ రావట్లేదా,, నీవే పాచి చెవులు. మహాప్రభో ఉదయాన్నే నీ ప్రాసల పిచ్చి ఆపేసి ఆ టీ కాస్త నా గొంతులో పోయి,అసలే పండగ నాకు చాలా పనులున్నాయి. సుప్రభాత సేవ కానిదే వేంకటేశ్వరుడు లేవడు, నా చేతి సుపానియం సేవించనిదే నువ్వు లేవవు, ఇందా లేచి తాగు. వంశీ ఇవాళ చాలా పనులు ఉన్నాయి, నువ్వెళ్లి నాలుగు టెంకాయలు, జీడిపప్పు,లవంగాలు,ఓ కేజీ బెల్లం , ముద్దబంది పూలు తీసుకురా. అదేంటి నిన్ననేగా కొన్నావ్ పూలు దీపు అవి ముగ్గుకి వేసేవి. ఇవి తోరణాలు కట్టడానికి ,  దీపు వర్ణ వివక్ష లాగా నువ్వు కార్య వివక్ష చూపకు. స్వామి , అవి సరిపోవు కానీ వితండ వాదాలు ఆపేసీ ...

పెళ్ళిపుస్తకం

 వంట వార్పు - ఒంట్లో ఓర్పు  దీపు :వంశీ ఈరోజు వంట ఏం చేయమంటావ్? వంశీ : పెంట పెంట చేయకుండా ఒంటికి అంటేది మంట మీద పెట్టి నా కంట పెట్టు దీపు: హా అయినట్లే ఇంక ఈరోజు మీ ప్రాసతో వంశీ : ప్రాసని అంత ట్రాష్ గా తీసుకోకు దీపు డియర్, మాటల్లో ప్రాస, సాధనలో ప్రయాస లేక పోతే పానకం లో ముంచని ఖాజల్లాగా చప్పగా ఉంటుంది జీవితం. దీపు : మహానుభావ లేచి బియ్యం వేసి , వంట లొ జంట కలుపు వంశీ : చూసావా చూసావా నీకు కూడా అంటేసింది  అంటూ ఇద్దరు వంట గదిలోకి వెళ్ళారు వంశీ : సెలవు దినం అయినా సేవ దినం ఐపోయ్యింది. అప్పుడేపుడో సినిమా వచ్చింది, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి అని, ఇప్పుడు మగ వాళ్ళ వంతు అయింది. దీపు : ఏంటి గొణుగుతున్నావ్? వంశీ : హా అన్ని నావే అంటావ్, గొణుగుడు నాదే గురక నాదే అని. దీపు : వేరే చెప్పాలా , నీ గురకకు బయట గూర్ఖాకి కూడా అనుమానమే ఇంట్లో ఎవరైనా చొరబడ్డారా అని చూస్తాడు. వంశీ: దీపు అది గురక కాదు నీ మీద ప్రేమ నిద్రలో కూడా ' ఐ లవ్ యూ దీపు ' అంటున్న , పెళ్ళి అయి ఇన్నాళ్ళైన నా ప్రేమ భాష అర్థం కాలేదా దీపు నీకు? దీపు : అబ్బా బడాయి, వంట ఏం చేద్దాం అంటే సలహా ఇవ్వవే ( నడుము మీద చెయ్యి వేసుకుని తల కొట్ట...