Posts

Showing posts from July, 2025

మాతృత్వం - పితృత్వం

 నాలుగేళ్ళ దాంపత్య జీవితం వారిద్దరిది. ఇంకా పిల్లలు లేరా అంటే , కొత్తగా పెళ్ళయింది కదా అనేటంతగా త్వరగా సాగిపోయింది జీవితం వాళ్ళది. ఇంకేం కొత్తగా పెళ్ళి, కొత్తగా అంటే మహా ఐతే ఆరు నెలలు అని ఎవరైనా అంటే మాకు మాత్రం నిన్ననే పెళ్ళయింది అనట్టు ఉంది అనేవారు. తుమ్ములు దగ్గులు లాగా అప్పుడపుడు చిన్న గొడవలు వచ్చినా ఆనందంగా సాగిపోయే ఆరోగ్య జీవితం. ఒక్క సంతానం లేదు అనే బెంగ తప్ప అచ్చమైన ఉగాది పచ్చడి లాగా ఉండేది వారి జీవనం. అతనికి వినికిడి లోపం,అతడి ముప్పై ఐదేళ్లకు కుదిరింది ఇద్దరి పెళ్ళి, తోడు కోసం వేచి చూసిన తన పదేళ్ళ ఒంటరితంలో ఒక్కసారిగా ఒక ఉల్కయన లాగా వచ్చేసి చెరిగిపోని ముద్ర వేసేసింది తనలో. పెళ్లైన నాటి నుండి రోజూ కంటి రెప్పల కొట్టుకోడాల కన్నా ఎక్కువ ముద్దులు, దద్దోజనం లోని పోపు కన్నా ఎక్కువ ఘాటు కౌగిళ్ళు . చిలుక గోరింక, ఎరుపు గోరింట సంసారం. వినికిడి లోపం ఉందని తెలియకుండా చూసుకునేది ఆమె. తన తనువు నుండి భాగమైన ఒక శిశువు కావాలని ఆమె, తన మనస్సులా మెరిసే ఒకరిని కనాలని అతను ,,వేచిచూశారు.కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇద్దరికీ నార్మల్ ప్రెగ్నెన్సీ అవలేదు. ఒక ఏడాది వరకు IVF చికిత్స తర్వాత వారి కల నిజమై...

ప్రాణం విలువ

 నేనడిగా నీ ప్రాణం విలువ ఎంత అని చెప్పాడు  ఓ కుర్రకుంక వాహనం మీద వెళ్ళే నూట ఇరవై వేగమంత అని చెప్పాడు  ఓ యువ కళేబరం ఓ సంక్రాంతి పతంగి కోసం, కోడి పందాల కోసం, పేకాట ముక్క కోసం కోట్లాడుకున్న వాడి గర్వమంత అని చెప్పాడు  ఓ వెధవ జుట్టు చెరిగిపోతుందని  శిరస్త్రాణం ధరించక, ఒంటి చేత్తో వాహనం నడుతు తాగుతున్న ఆ గాజు సీసా అంత అని నేనడిగా నీ ప్రాణం విలువ ఎంత అని చెప్పాడు ఓ సైనికుడు కోట్ల మంది ప్రాణాలు కాపాడే తన కర్తవ్యమంత అని చెప్పాడు ఓ కూలివాడు తనలో నెత్తురంత చెమట చిమ్మి సంపాదించిన తన రోజు కూలి నోటంత అని చెప్పాడు ఓ రైతు ఎండకి ఎండీ, వానకి తడిసి, చలికి వణికి చెమటతో భూమిని తడిపి కోసిన తన కోత స్వచ్ఛతంత అని

సంసారం సాహిత్యం

 ఆ రోజు రెండో శనివారం కావడం మూలాన వంశీకి సెలవుదినం , కొంచం ఆలస్యంగా ఏడింటికి నిద్రలేచి నిమ్మళంగా టీ తాగేసి టీవీలో పాటలు పెట్టారు ఇద్దరు (వంశీ , దీపు). దీపు టీవీ రిమోట్ తీసుకుని తనకి బాగా ఇష్టమైన న్యూయార్క్ నగరము నిదురోయే వేల పాట పెట్టీ వింటోంది, వంశీ దీపుని చూస్తూ ఉన్నాడు. పాట అయిపోయాక  దీపు : వంశీ నువ్వు కూడా ఇలా నా గురించి ఒక పాట వ్రాయవ అనడిగింది వంశీ : తప్పకుండా ట్రై చేస్తా దీపు.   ఓ కన్నె వెన్నెల నా కన్నులు నిన్నే కలవరిస్తూ నన్నే మరచి నిన్నే గాంచిన నా మనసా ఆనందమస్తు  దీపు : మస్తు ఏంటి  వంశీ : ఇది మస్త్ మస్త్ కాదు దీపు మస్తు అంటే అలాగే ఉండు అని.  దీపు : కొంచం మామూలు పదాలు వాడి వ్రాయి వంశీ ఇంతలో యూట్యూబులో పాట అయిపోయి తరువాతి పాట ఖడ్గంలో ' నువ్వు నువ్వు ' మొదలైంది దీపు అమాంతం సౌండ్ పెంచేసింది . దీపు : ఏం వ్రాసారు వంశీ సిరివెన్నెల గారు ఈ పాట అని గాలిలోకి రెండు ముద్దులు విసిరి ఒక దణ్ణం పెట్టింది. వంశీ : పాట చాలా బాగుంది కానీ ఇక్కడ ఫీమేల్ డామినేషన్ బాగా కనపడుతుంది దీపు. దీపు( ఆశ్చర్యంగా ) : ఏంటి! వంశీ : అవును దీపు అసలు పాట అంత ఆమె మాటే కానీ అతని మాట వినద? దా...