అందరి బంధువయ - ఆకాశ రామన్న
ఇప్పుడంటే watsappulu, ఫేస్ బుక్కులు వచ్చాయి కానీ మా చిన్నపుడు అయితే మా పోస్ట్ మానే అన్ని. ఆఫీస్ కి వెళ్ళే వోళ్ళు పొద్దున్నే తినేసి ,మధ్యాహ్నం భోజనం డబ్బా తీసుకెళ్తారు కానీ మా పోస్ట్ మాన్ అలా కాదు. ఆయనకి డబ్బా అవసరం లేదు నీళ్ళ బాటిల్ అవసరం లేదు. తొక్కిన గడపలో మేతుకైన తినాల్సిందే లేక కనీసం టీ , కాపీ అయిన తగలాల్సిందే.
మనకి ఒక చుట్టరికం , కొన్ని వరసలు ఉంటాయి ఆయనకి అలా కాదు అన్ని చుట్టాలు ఆ సంచి లో వేసుకుంటాడు, అన్ని వరసల పిలుపులు వింటాడు, మా పిల్లకాయాలకి తాత ,కొంచం పెద్ద అబ్బాయిలకి బాబాయ్, మా అమ్మలకి తమ్ముడు ,నాన్నలకి బావ బామ్మర్ది , తోబుట్టువు తోడు అన్నీనూ. మా అవ్వలకి , అబ్బలకి కొడుకు వరస.
మా అన్నకి ,బావ కి ఎవరికి ఉద్యోగం వచ్చినా ఆయన నోటెమ్మట రావాల్సిందే. ఏనకటికి కొత్తగా పెళ్ళైన ఎంకట లచ్చిమి మొదటి కాన్పుకి ఊరెళ్ళింది , బిడ్డని కనేసిందని ఊరంతా దండోరా ఏసి మరి చెప్పేశాడు. ఎన్ని పెళ్లి సంబంధాలు చుసాడో, ఎన్ని కొంపలకి తోరణాలు కట్టిండో లెక్క లేదు.
మా పక్కింటి బామ్మగారికి ఇంట్లో అన్ని ఆయనే. ఓ మిట్టమధ్యాహ్నం ఎండకి అలిసొస్తే అరేయ్ చవట ఆ మేహం మసికొట్టుకు పోయింది వచ్చి కాళ్ళు మొహం కడుక్కుని ఓ ముద్ద తినిపో అంది. అబ్బా బామ్మ చాలా పని ఉంది చాలా ఉత్తరాలు పంచాలి పొద్దు గూకినాక వచ్చి తింట అంటే వీపు విమానం మోగిస్త ఆ ఉత్తరాలు నేను పంచి పెడతా వచ్చి తిను సన్నాసి అని కసిరింది. ఇక గత్యంతరం లేక బోజనానికి తయారయ్యాడు. చాలు బామ్మ అన్న మొట్టికాయ వేసి మరి వడ్డిస్తోంది.
బామ్మ మొన్న తెచ్చిన కళ్ళ జోడు ఎలా ఉందే , బానే కనిపిస్తున్నాయా అంటే, తెచ్చింది ఎవరు మరి మా రామన్న , ఇసుకలో సూది పడిన తీస్తా అనేసి గారాబంగ మేటికలు విరుచుకుంది.
నెయ్యి వేస్తూ వీపు నిమిరి అరేయ్ కొడకా ఈ ఇంట్లో చిన్నది సీత పైట వేసుకునే వయసొచ్చింది రా. దాని ముక్కు ,చెవులు కుట్టించినొడివి నువ్వే ఓ మాంచి కుర్రాన్ని చూడరా అంది ప్రేమగా.
బామ్మ నువ్ అంతగా చెప్పాలటే, నా పెళ్ళాం బొడ్డు కాక పోయిన న బిడ్డ కాదా అది. నువ్వేం దిగాలు పడకు నేను చూస్తాగా అంటే అది అలా అన్నావ్ చచ్చి నీ కడుపున పుడతారా నాయన అనింది. చాల్లే బామ్మ రిటైర్ అయిపోయే వయసులో నాకు అంత బలం ఎక్కడ, ఉన్నా కూడా , నీ కోడలికి అంత ఓపిక ఎక్కడ అన్నాడు. హారి పీనుగా అని వీపు చరిచి ఇందా పెరుగు ఎస్కో అని పెరుగు చెక్కర వేసింది. సుస్తుగా తినేసి లేచాడు.
చెప్పుకుంటూ పోతే మా రామన్న గురించి అంతే లేదు. ఎవరికైనా డబ్బు అవసరమైతే నీ దూరపు బంధువు పంపాడు అని, నీ మావా పంపాడే, లేదా సర్కారు పంపిందిరా సమయానికి అని మనీ ఆర్డర్లు చేతిలో పెట్టేవొడు. అలా ఎన్ని ఇచ్చిండో లెక్క లేదు. సగం జీతం వీటికే అయ్యేది. ఎంత ఇచ్చిన ఇంటికి డోకా లేకుండా చూసేవాడు. ఉత్తరాలు ఇవ్వడానికి తిరిగినట్లు సరకారు ఆఫీస్ ల చుట్టూ తిరిగి రోడ్ల అనుమతి తెప్పించి వేయించాడు.
చివరికి పదవి విరమన అయింది. మా ఊరు మాత్రం మా రామన్నని విరమించలేదు. బామ్మ తన ఇంట్లోనే ఉండిపోరా పరాయి దాన్ని అనుకున్నావా ,నా కొరివి పెట్టేటోడివి ఇంట్లో కాకుండా ఎక్కడ తగలడతావ్ అని పట్టు పట్టి మరి ఉంచ్చింది. ఊరంతా పండగ చేసుకున్నారు.
ఆ దేవుడికి మేమంటే కుళ్లు కాబోలు , లేదా మాకంటే ఆయనకే ఎక్కువ ఇష్టం కాబోలు రామన్న అంటే, ఉత్తరం రాయించుకుని పిలిపించుకుని అక్కడే ఉంచుకున్నాడు. మా ఆకాశ రామన్నని ,ఆకాశం రమ్మని ఉంచేసుకుంది.
Comments
Post a Comment