అనాథ నోట అనాది పాట

 కన్నవారిని దేవుళ్లు అంటారంటే 

నన్ను కనిపాడేసిన మిమ్మల్ని ఏమనాలి 

ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం 

పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం 



అమ్మ అనేది ప్రధమ పలుకేమో అందరికి 

ఆకలి నా మొదటి అరుపు నా కడుపుకి 

ఆదమరిచి ఆ ఒడిలో పడుకునే బాల్యం అందరిది 

ఆప్యాయత మరిచి అడుక్కునే  బతుకు నాది 

పాలతో నోరు తడుపుకోలేక, నీళ్లతొ  కళ్లు నింపుకున్న


ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం 

పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం 

.........


అమ్మ చేతి నిండా నిండే ముద్ద ఒకటైన  తిందామనుకున్న 


రూపాయి అయినా పట్టని నాచేయి చాచి రూపాయి కోసం నిలుచున్న 


పొద్దుపొద్దునే ముద్దుపేరుతో ముద్దులిచ్చి నిద్రలేపుతుంది అమ్మ అనుకున్న 


ఎండ తాకి, దుమ్ము సోకి, గతం విడిచి, గమ్యం మరిచి సాగుతున్న

ఎందుకిచ్చావ్ అమ్మ నాకు జననం 

పూటకోసారి పోతుంది నాన్న ప్రాణం

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం