నవ్వించు వాడు వైద్యుడు
పేరు కి శేష శైల వ్యాసుడి పేరు వెంకట్రావు పెట్టుకుని అందరికి హాస్య వసుడిగా ఉంది పోవాలని వెంకట్రావు ని కాస్త వెంగళరావు గా మార్చుకున్న ధీశాలి, హాస్యశీలి, నవ్వులశాలి. జ్వరం వచ్చిన, దగ్గు వచ్చిన నవ్వే ఆయనకి మిరియాల కషాయం , అల్లం రసం.
ఎవరైనా కొత్తగా పరిచయం అయితే alov alov ఐయామ్ వెంగల్ వెల్కమ్ అంటూ నమస్కారం పెట్టేస్తాడు. వాళ్లు కాస్త ' పాపం ఆయనకి నాతి ఏమో వెల్కమ్ ని వోతి మరీ పలుకుతున్నాడు అనుకుంటారు.
ఈయన గారికి చావు అంటే ఒక పెద్ద చేలోక్తి, దాని గురించి మాట్లాడాలన్నా వినాలన్న, దాని మీద చేలోక్తి విసరాలన్న మహా చెడ్డ ప్రీతీ , ఆయనకి ఏదో తృప్తి. అంటే అయన చేలోతి అంటే చచ్చేంత ఇష్టం అని.
తన దగ్గర మనిషైనా గోవిందం కనిపిస్తే ' ఏమోయ్ గోవిందం నువ్ ఇప్పుడు హుటాహుటిగా టాప్ అని హరిమన్నవ్ అంటే ఏమంటారో చెప్పుకో అన్నాడు '
బిత్తర పోయిన గోవిందం ' పొద్దుపొద్దునే శుభమా అని సుబ్రభాత వేల ఈ చావు సన్నాయి ఏంటి నారాయణ. అయినా ఈయన నోటా మాట, వేటగాడి తూటా బైటికి రానిదే సంతోషించరు. వేరే గత్యంతరం లేక, చిత్తం సెల్వవివండి విని ఇక్కడే ఈ జీవత శాపవిమోచనం పొంది ఏ ఇహలోకాలకో వెళ్ళిపోతాను ' అన్నాడు
మన వెంగళం గారు ఇవేం పాటించుకోరు. అయన షుగర్ పేషెంట్ లాగా ఒక హాస్య పేషెంట్. తొందరెక్కువ.
"గోవిందం గోవింద, గోవిందం gone " అనేసి నవ్వేసాడు.
అదివిన్న గోవిందం ' మహాప్రభో చావు వార్త కూడా ప్రాసలు, పద్ధతులు, ఛలోక్తులు, చమత్కారాలు ఏంటండీ నా మొహం మండ. కనీసం తలనొప్పయినా ఎరుగని నాకు ఈ పిండవార్తలు ఏంటండీ 'అన్నాడు
వెంగళం మాత్రం తాపీగా ' సర్లేవోయ్ బతికుండగానే అన్ని రుచి చూడాలి. చారు రుచి, బారు రుచి, చావు రుచీను'
బాబ్బాబు మీకు పుణ్యముంటుంది నా భార్య పేరు మీద కూడా ఒక చావు రుచి ఎం కర్మ ఏకంగా చావు బోజనమే పెట్టండి కనీసం విని అయినా తరిస్తా అన్నాడు. అన్నట్టు నే భార్య పేరు కాంతం కదూ. సరే ' నే భార్య కాంతం ఇక నుంచి అది అంతం, ఎంత వుందోయ్ అన్నాడు ' నిజం కాకపోయినా కలలోనైనా కలగనట్లు ఇది సంబరపడిపోయి దణ్ణమెతేసి నవ్వుకుని వెళ్ళిపోయాడు గోవిందం
ఓరోజు పక్కింటి పార్వతీశం గుండెపోటు తో పోతే, చివరి చూదాం అని గోవిందం, ఛలోక్తి కోసం అని వెంగళం బయల్దేరారు. చివరిసారిగా చూసి ఒక పక్కకొచ్చి నిలబడ్డారు ఇద్దరు. ఏదో సినిమా హాల్ కి వెళ్ళడానికి ప్రతీ వాడు టికెట్ తీస్కోవాలి అన్నట్లు ప్రతీ వాడు వచ్చి ఏదో వచ్చి రాని సినిమా ఏడుపు తెచ్చుకుని పిల్లి కూతలు కోసి కిళ్ళీకొట్టుకెళ్ళి ఒక పొగ లాగి వెళ్లిపోతున్నారు.
వెనగలం గోవిందం తో అన్నాడు ' గుండ్రాయి ల గుండ్రంగా ఉండే వాడు, గుండెపోటు ఎలా వచ్చిందంటావ్? ' గర్భవతి కి వాంతొచినట్లు గోవిందం కి నవ్వు తన్నుకొచ్చింది. నానాతంటాలు పడి ఆపుకున్నాడు.
ఇంకో సారి కాలం చేసిన కృష్ణ రావు ఇంటికి వెళ్లి " పాపం ఇల్లు కట్టాలని loan తీస్కుని, lonely గా పాడే కట్టేసుకున్నాడు " అన్నాడు ఇంకా తనవల్ల కాక గోవిందం "మహాప్రభో షుగర్ పేషెంట్ తన ధార ఆపుకోగలడేమో కానీ ఇంత చావు సమయం లో కూడా నేను నవ్వు ఆపుకోలేక పోతున్న, వేలెవరైనా చూసారంటే నన్ను ఫ్రీ గా ఏ ఖర్చులేకుండా దినం పెట్టేస్తారు , మీరు అన్నట్లు గోవిందం గోవింద కాస్త నిజం చేసేస్తారు వీళ్ళు, అది కాస్త మా ఇంటిళ్లిపాథిలి ఊతపదం అయిపోతుంది " అనేసి దణ్ణం పెట్టేసి వచ్చేసాడు
ఇంకోసారి పంకజం పోతే, ఆరోగ్యాంగా ఉన్న ఈవిడ ఎలా పోయిందా అనుకుని భర్త గిరీశం ని "ప్రశాంతంగానే అంటే? " హా ఏదో పోయింది అనడు గిరీశం. వెంగళం మాత్రం గోవిందం చెవిలో "నాకు మాత్రం ప్రశ్నార్థకంగానే పోయినట్లుంది " అన్నాడు
ఎంత హాస్యం ఉన్న ఇద్దరి మధ్య అనురాగాలు బాగానే ఉండేవి. పెళ్ళాం పిల్లలు లేని వెనగలం కి గోవిందం అంటే అభిమానం గారాభం. తండ్రి కొడుకులు లేని గోవిందం కి వెనగలం అంటే మర్యాద ఆప్యాయత. సొంత బాబాయ్ ల చూసుకునే వాడు వెనగలం ని. గోడ మేకు, ఆకు వక్క, సున్నం చెక్క ల ఉండేవారు.
ఆలా మూడు జోకులు ఆరు ఛలోక్తుల తో కాలం గడిచిపోయేది. చివరికి ఒక రోజు రానేవచ్చింది . బతికుండగా చూడాలి అనుకున్న ఆశ. పాపం బతకలేక పోయాడు. చాలా బతికి'పోయాడు చివరికి.
చావుని చూసాడు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు, చావు అంది "నేను నిన్ను చంపలేను వెంగళం. అంత శక్తి నాకు లేదు. నీ నవ్వు నీ దెగ్గర ఉనంత కాలం ఎవరు ఏమి చేయలేరు. నవ్వుని ధాటి వెళ్లే శక్తీ నవ్వుకి మాత్రమే వుంది, "అనేసి దీవించేసింది . ఆశీర్వాదం పుచ్చుకున్న వెంగళం కళ్ళు ముస్కుని నమస్కరించి చూసే సరికి స్వర్గం చేరిపోయాడు.
తనలో తానే నవ్వుకుని నవ్వు నాలుగు విధాలు
శ్రీరాముని పట్టాభిషేకం లో అందరూ ఆనంద పరవశులై నవ్వుతుంటే
1) తన మీద నెగ్గాడు అని అహంకారం తో నవ్వుతున్నాడు రాముడు అనుకుని భరతుడు
2) తన పట్టాభిషేకం చూసి తన్మయం చెందుతున్నారు అని రాముడు
3) తన కోతి రూపు చూసి నవ్వుతారు అందరూ అనుకుని ఆంజనేయుడు
4) అన్న కి నమ్మిన బంటు ga ఉన్న తనకేం దక్కలేదని హేళన గా నవ్వుతున్నారు అనుకుని లక్ష్మణుడు
నలుగురు నాలుగు విధాలుగా అనుకున్నారు. ఏమైతే ఏంటి అందరూ నవ్వుకున్నారు .
చివర్లో వెంగళం వచ్చి అన్నాడు "alov alov ఐయామ్ వెంగల్, నో bengal, "అనేసి నవ్వేసి నవించేసి నవ్వుకుంటూ నవించుకుంటూ వెళ్ళిపోయాడు
నవ్వించు వాడు వైద్యుడు, నవ్వే వాడు ధన్యుడు
Comments
Post a Comment