తెలుగు

 మొదట పలికిన నా తెలుగు పలుకు

చేనులో గాలికి మొక్కల కులుకు

పువ్వుని ముద్దాడిన చిలక లోలుకు

మాట్లాడుతుంటే చుక్కల మిణుకు


సొగసైన పెద్ద బాల శిక్ష

వ్యాకరణానికి శ్రీరామ రక్ష

అందాల ఆటవెలది

తేనె అద్దిన తేటగీతి

చందమామను తలపించు చెంపకమాల

ఉషోదయ వెలుగు వెలుతురులా

ఉత్పలమాల


వినసొంపైన సామెతల మోత

ఉగాది పచ్చడిలొ మామిడి పూత

ఒంపుల గుండ్రని రాత 

కన్నులకు నిండు మేత


తిక్కన పోతన నన్నయ

తెలుగు సౌరభం కృష్ణదేవరాయ

మా భాషా పితామహుడు రామ్మూర్తి

మన గర్వం సత్యనారాయణ శాస్త్రి


భర్తృహరి సుమతీ శతకం

నూరేళ్ళకు మరువలేని సుభాషితం

అల్లసాని పెద్దన్న,తిరుగులేని వేమన

 శ్రీ శ్రీ , దాశరథి గురజాడ

రొమ్ములు గుద్ది చెప్పు తెలుగువాడా


నిత్య యవ్వన సిరుల మల్లి

అందాల మా తెలుగు తల్లి

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం