పెళ్ళి పుస్తకం 1

 పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా...


వంశీ...

కోనేటి రాయడా..


పొడగంటిమయ్యా మిమ్ము...


వంశీ...


టీ పెడుతూ పాడుకుంటున్న వంశీని గట్టిగా పిలిచింది దీపు.


ఏంటి దీపు


మన ఇంటి దేవుడు వంశీ వేంకటేశ్వరుడు నువ్వు అలా పొద్దున్నే పాచి నోటితో కీచు గొంతుతో పాడితే  దేవుడెం ఖర్మ ఇంట్లో ఉండే మనుషులే పోతారు.


దీపు,,నాది పాచి నోరు కాదు ఇది కీచు గొంతు అంతకంటే కాదు. నేనెప్పుడో దంతధావనం కార్యక్రమం చేసేసా అదిగో closeup పేస్ట్ ad లొ లాగా నా సువాసన గాలిలొ తేలుతూ రావట్లేదా,, నీవే పాచి చెవులు.


మహాప్రభో ఉదయాన్నే నీ ప్రాసల పిచ్చి ఆపేసి ఆ టీ కాస్త నా గొంతులో పోయి,అసలే పండగ నాకు చాలా పనులున్నాయి.


సుప్రభాత సేవ కానిదే వేంకటేశ్వరుడు లేవడు, నా చేతి సుపానియం సేవించనిదే నువ్వు లేవవు, ఇందా లేచి తాగు.


వంశీ ఇవాళ చాలా పనులు ఉన్నాయి, నువ్వెళ్లి నాలుగు టెంకాయలు, జీడిపప్పు,లవంగాలు,ఓ కేజీ బెల్లం , ముద్దబంది పూలు తీసుకురా.


అదేంటి నిన్ననేగా కొన్నావ్ పూలు దీపు


అవి ముగ్గుకి వేసేవి. ఇవి తోరణాలు కట్టడానికి , 


దీపు వర్ణ వివక్ష లాగా నువ్వు కార్య వివక్ష చూపకు.


స్వామి , అవి సరిపోవు కానీ వితండ వాదాలు ఆపేసీ వెళ్ళి తీసుకురా,


నీతో వాదాలు నీ నోటి వాద్యాలు నాకేం కొత్త కాదు but as a respected house husband I need to remind you the financial status of an average working man, దీపు 


ఆపు 


మంచం దిగుతూ దుప్పటి మడతేసి లేచింది.


ఏంటో పెళ్ళై ఇన్ని రోజులైనా దీపు రోజు అంత అందంగా కనిపిస్తుంది, అప్పుడే నిద్ర లేచిన చెరిగిన జుట్టుతో చాలా అందంగా కనిస్తుంది అయినా ఇంత అందం పెట్టుకుని ఊరికే ఆ lipstick లు, మేకప్ లు, touchup లు ఏంటో అనుకున్నాడు వంశీ.


దీపు వెనకాలే ,, పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు కొంత పడమరలి నవ్వేనీ పెండ్లి కూతురు....


అదిగో ఇందాకే అన్నాను ఆ గరళ స్వరమేసుకుని అంత మంచి పాటలు చెడకొట్టకు అని ..


దీపు my dear wife , దేవుడికి కావాల్సింది స్వరం, రాగం కాదు పాడగలిగే గళం 


(అంటుందే కానీ దీపుకి అలా పాడితే చాలా సరదా ఇష్టం కూడా)


లేచి బైటకి వచ్చి వంశీ నీకు ఎన్ని సార్లు చెప్పాను తులసిని కొంచం పట్టించుకోమని 


రామ రామ ,, తులసా, నువ్వు తప్ప వెరసి ఏ ఆడవాళ్ళు తెలియదు దీపు నాకు.


సంబడం , కధలు పడుతున్నావు


లేదూ దీపు నీ వెనకాల పడుతున్న


సరసాలకేం కొదువలేదు పొద్దున్న ఆఫీసు పోవాలని పెందరాలే స్నానం చేస్తావు ఆ చేత్తో తులసి మొక్కకు ఓ మొక్కు మొక్కి ఓ చెంబుడు నీళ్ళు పోయచ్చుగా


ఓహ్ అదా (తనకి తులసి గురించి ఎవరు చెప్పారా అనుకుంటూ) చిటికెలో పొస్తా కానీ ఈ పాట విను కొత్తగా వ్రాశా 


తగలెట్టు,, తప్పుతుందా చెవులకి కూడా కళ్ళకి మాదిరి ముసేసుకునే వరం ప్రసాదించు దేవుడా...


హా ఆ దేవుడి మీదే పాట ,విను


రామ రామ రామ

నీ పేరులోనే సోమ

నీ పాదాల వద్ద ఈ జన్మ కర్మ

నీ స్మరణలో పారిపోయే దోమ


అయ్యో శ్రీరామ చంద్ర ప్రభూ! నీ బొంద లా ఉంది పాట


హాల్లో హాల్లో హోల్డాన్, నా పాటలకి ఎంత అభిమానులున్నారో నీకు తెలీదు , ఆ రోజుల్లో నా పాటలంటే చెవి కోసుకునే వారు తెలుసా


హా అదే నేను చెప్పేది చెవి కోసుకోడమే కాదు పీక అయినా కోసుకుంటారు నీ పాటలు వింటే


దీపు నే పాడేది విని కాదు వ్రాసింది చదివి ఫ్యాన్స్ అయ్యారు అని.


అవును కదా అందుకే ఏమో స్వాతి, మాయ, ప్రీతీ , జ్యోతి....


జ్యోతి ఆ ? జ్యోతి ఏం లేదు దీపు,,పేరు ప్రీతి కాదు కీర్తి... అయినా నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ తెలీదు అంటే వినవే . మన పెళ్ళిలో కాలిపోయి మిగిలిన ఆ బూడిద సాక్షి దీపు.


అంతేలే లేని వాటి మీద కాలిన వాటి మీదే నీ గెంతులు


ఇంతలో వంశీ అమ్మ వచ్చి అలా కూర్చుని వీళ్ళ గొడవ చూస్తూ నవ్వుతోంది.


అమ్మ ఇక్కడేం రామాయణం, భాగవతం కాదు జరిగేది, కురుక్షేత్రం నువ్వు దూరంగా ఉండు ఎప్పుడు ఏ హఠాత్పరిణామం చోటు చేసుకుంటుందో చెప్పలేను.


అతయ్యకి నీతో ఏం కొత్త కాదు ముప్పై ఐదేళ్ళు నుండి చూస్తుంది గా, మీరైనా చెప్పండి అత్తయ్య ఈయన బాగోతం.


బాగోతం లేదు దద్దోజనం లేదు నన్ను నింపకండి ఇందులో, అరేయ్ కూరగాయలకు చిల్లర ఐదు వందలు ఇవ్వు.


అమ్మ నువ్వేం అడిగావో నీకు అర్థమైందా, చిల్లర అంటే ఓ వందో , యాబయ్యో అనచ్చు, ఐదు వందల ఇప్పటి భారత దేశ కరెన్సీలో పెద్ద నోటు,, మేము అడిగితే రూపాయి , పావలా ఇచ్చే వాళ్ళు.


మూతి బూర్లె మూకుడు ఐపోతుంది,  నువ్వేం బంగళా కట్టేవాడివా ఆరోజుల్లో ఎక్కువ ఇవ్వడానికి. అయినా పొట్టేటోడికి పొట్టేడు అంగీలు అన్న పొడుపు లాగా చిన్న నోరుకి చిన్న నోటు, పెద్ద నోరుకి పెద్ద నోటు అని జేబులో ఐయిదోందలు తీస్కుని వెళ్ళింది.


ఈ మాత్రం దౌర్జన్యానికి ,అంత వినయ విన్నపం దేనికి అనుకుని ,, ఆ దీపు ఇందాక ఏదో అన్నావ్..


అంత భాగ్యమ నాకు పెళ్ళైన నాటి నుండి నోరు విప్పి ఒక్కమాటైన మాట్లాడనిచ్చావా అ  అంటే బిసి బేలే బాత్ , ఉ అంటే ఉర్ల గడ్డ వేపుడు అని నన్ను వేపుకు తింటావు . అవేం పంచభక్ష పరమాన్నాలా,,,


మీ ఆడవాళ్ళు ఇన్నేసి అంటారు కానీ మీకు తప్ప ఎవరికి ఉంది స్వాతంత్రం ఇంట్లో, నీ పనైపోయింది అని ఒక పక్క మంత్రాలు చదువుతున్న అవేం పట్టించుకోక తాళి కట్టిన మగాడి అమాయకత్వాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు.అందుకే ఆ శ్లోకం


మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం


మాంగల్య జీవితం తంతే నాయన , నీ జీవనం హేతువాదం కోల్పోతుంది, కన్ను కిడ్నీ భగ్నం అయిపోతాయి, నీ జీవితం సర్వం సమాప్తం అన్నారు.


మాంగల్య ధారణ  ముహుర్తో శుభముహూర్తొస్తు...


తాళి కట్టే ముహూర్తం నీకు శుభం కార్డు పడడానికి శుభ ముహూర్తం అని.


ఇవి పెళ్ళికొడుక్కు వినపడకుండా ఉండడానికి భజంత్రీలు భజంత్రీలు అని గట్టిగా వాయిస్తారు వాయిద్యాలు


అమ్మో అమ్మో ఇది నా పుట్టిళ్ళు కాదనేగా ఇన్నేసి అంటున్నారు. 


ఆ ఇది పుట్టిళ్ళు కాక పోతే పెంకుటిళ్ళా,, ఆ ఇంటి బయిట పలక చూసావు మొదట నీ పేరే ఉంది.


పలక మీద రాసుకోవడానికి ఇంకా చిన్నపిల్లను కాదు ఆ రాసేదేదో రిజిస్ట్రార్ పత్రాల మీద రాయించ్చు అప్పుడు నమ్ముతాను


తనేంటి ఉన్న ఫళంగా టాపిక్ మార్చేసింది , మనమూ మారిస్తే పోలా,,


దీపికా


స్వామీ నాకు పోతుంది ఓపిక


అది కాదు దీపు 

నాయన ఈ వాదాలు ఇంకెంత సేపు 


అబ్బా దీపు ఇలా చూడు I love you దీపు 


ముసి ముసిగా నవ్వేసింది


హమ్మయ్య ఈ రోజుకి బట్ట కట్టేసాను

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం