Posts

Showing posts from June, 2025

నువ్వు లేని సమయం

 ప్రతీ ఉదయం నే చూసే తొలి చిత్రంగా నిన్నే చూడాలి  ప్రతీ రాత్రీ నే సేద తీరే చివరి క్షేత్రంగా నిన్నే చేరాలి  చెప్పుకున్న సరదాలే రోజంతా చెప్పుకుంటాం ఎన్ని సార్లయినా కొత్తగా నవ్వుకుంటాం  నువ్వే జతనుంటే ఆనందాల చవితి నువ్వే చెంత లేకుంటే కొలవలేని వెలితి  గడియారం గడపనే చూస్తోంది నీ కాలి అలికిడి ఏది అని దువ్వెన్నె కాచుకుని కూర్చుంది  నీ కురుల వసంతం ఎప్పుడని పరుపేమో మడతలు లేక అలలు లేని కొలనులా ఒంటరి అయ్యింది దుప్పటేమో మన కౌగిల్లు కానరాక కునుకు మాని అలక చూపింది ఆలస్యం చేయకు ఆరాటం తట్టుకోలేను ఆటలాడకు నీ ఆలోచనలు ఆపుకోలేను
 దాచుకునేదే నీ రూపమని దర్జాలకి పోతవు  నే మోజుకున్నదంతా వ్యర్థమని దోచుకుని పోతవు మూడుకనులున్నా కన్నప్ప కన్ను కోరితివి  నిన్ను కొనియాడిన రావణుని కడుపు కోస్తివి నిన్ను నమ్ముకున్న భస్మాసురుడిని నిలువునా కాల్చితివి అందని అంతగాడివి, అడిగితే ఇంతగాడివి శోకంలో సొంతగాడివి,సామి నువ్వో వింతగాడివి  ఈడనుంటవు ఆడనుంటవు, దొర నిను వీడి నేన్యాడనుంటను  నా కథ నీ కాడికే రా, నా కట్టే నీ కాటికే రా