పెళ్ళిపుస్తకం

 వంట వార్పు - ఒంట్లో ఓర్పు 


దీపు :వంశీ ఈరోజు వంట ఏం చేయమంటావ్?

వంశీ : పెంట పెంట చేయకుండా ఒంటికి అంటేది మంట మీద పెట్టి నా కంట పెట్టు

దీపు: హా అయినట్లే ఇంక ఈరోజు మీ ప్రాసతో

వంశీ : ప్రాసని అంత ట్రాష్ గా తీసుకోకు దీపు డియర్, మాటల్లో ప్రాస, సాధనలో ప్రయాస లేక పోతే పానకం లో ముంచని ఖాజల్లాగా చప్పగా ఉంటుంది జీవితం.

దీపు : మహానుభావ లేచి బియ్యం వేసి , వంట లొ జంట కలుపు

వంశీ : చూసావా చూసావా నీకు కూడా అంటేసింది 

అంటూ ఇద్దరు వంట గదిలోకి వెళ్ళారు

వంశీ : సెలవు దినం అయినా సేవ దినం ఐపోయ్యింది. అప్పుడేపుడో సినిమా వచ్చింది, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలి అని, ఇప్పుడు మగ వాళ్ళ వంతు అయింది.

దీపు : ఏంటి గొణుగుతున్నావ్?

వంశీ : హా అన్ని నావే అంటావ్, గొణుగుడు నాదే గురక నాదే అని.

దీపు : వేరే చెప్పాలా , నీ గురకకు బయట గూర్ఖాకి కూడా అనుమానమే ఇంట్లో ఎవరైనా చొరబడ్డారా అని చూస్తాడు.

వంశీ: దీపు అది గురక కాదు నీ మీద ప్రేమ నిద్రలో కూడా ' ఐ లవ్ యూ దీపు ' అంటున్న , పెళ్ళి అయి ఇన్నాళ్ళైన నా ప్రేమ భాష అర్థం కాలేదా దీపు నీకు?

దీపు : అబ్బా బడాయి, వంట ఏం చేద్దాం అంటే సలహా ఇవ్వవే ( నడుము మీద చెయ్యి వేసుకుని తల కొట్టుకుంటూ)

వంశీ : ఆలు ఫ్రై, టమోటా పప్పు కలయిక మన లాగా ఉంటుంది చేసేయి 

దీపు : మళ్ళీ ఆలు నా, నిన్ననేగ వేసింది సాంబారులోకి , అదేమైనా దివ్యౌషధమా రోజు చేయడానికి

వంశీ : ఆలుని ఏమి అనకు కీళ్ళు విరిచేస్తా 

దీపు : ఏంటన్నావ్ 

వంశీ : అబ్బే ఏం లేదు రోజూ ఆలు తింటే కీళ్ళ నొప్పులు వస్తాయి అంటున్నా

నా ఖర్మ కానీ, ఈ యాతన తప్పే ఉపాయం కావాలి, చందు బాబాయిని అడుగుదామా, హా ,,నా తలకాయ కానీ ఆ రొమాంటిక్ guy ఆడవాళ్ళ పార్టీగా , ఇంకేం ఇస్తాడు నాకు సలహా, పోనీ మన నర్సయ్య గాడిని, ఒద్దులె వాడు పాలు పొంగిస్తుంటాడు ,,నో నీడ్ టు డిస్టర్బ్ హిమ్, అనదర్ ఆప్షన్ మల్లి గారిని,,, హమ్ ఆయనకి మళ్ళీ మే లో పెళ్ళి ఉందిగా , అయ్యాక అడుగుదాంలే.

దిక్కే లేదు,,, హిమాలయ పర్వతంపైన ఉండబట్టి సరిపోయింది లేక పోతే శివుడికి కూడా వంట పని ఉండేదేమో సుమీ 


దీపు : (పరాలోచన్లో ఉన్నా వంశీని తట్టి పిలుస్తూ) హలో వంశీగారు ఆలోచన తరువాత ముందు ఆచరణ కానివ్వండి, ఈ రోజు పన్నీర్ లిఫాఫా చేద్దాం 


ఇంతలో వచ్చిన వంశీ అమ్మ : ఏం పాప

వంశీ ; (వంటల్లో కూడా వీళ్ళ ఆధిపత్యం ఒకటి) అమ్మ అది పాప బాబు కాదు , its ఫాఫా, పన్నీర్ లిఫాఫా 

అమ్మ: ఫాఫా లు పాపాలు వంటల్లో ఎందుకు, ఇంచక్క ఉప్మా చేయరాదు?

వంశీ : అమ్మ ఉప్మా ఉప్మా అని చిన్నప్పటి నుండి చూస్తున్న ఒక రోజు సేమ్యా ఉప్మా, ఇంకొరోజు సన్న రవ్వ ఉప్మా, ఇంకొరోజు ఎర్రరవ్వ ఉప్మా, అసలు నాకు అన్నప్రాసన చేశారా లేక ఉప్మా ప్రాసన చేసారా. 


అమ్మ ఒక్క మొట్టికాయ ఇచ్చి వెళ్ళింది


దీపు : వంశీ పన్నీర్ సన్నగా తుమూరు, ఉల్లిపాయలు సన్నగా తరుగు, చాలా సన్నగా

వంశీ : మిక్సీలోకి వేయనా పోనీ?

దీపు : ఇవే. ఈ ఎకసేకలె ఒద్దు అనేది.

వంశీ : అబ్ర పదమునా విభ్రమ విలసితా శుభ్ర కౌముది దీపికా ఆ ఆ 

దీపు ; ఒక్కసారిగా ఉలిక్కి పడి చూసి వంశీ ఏమైంది,,,

వంశీ : పాట దీపు,,,

దీపు : ఏడ్చావ్ 

వంశీ ; ఎందుకు దీపు మీ ఆడవాళ్ళు మమ్మల్ని ప్రేమ చూపించరు అంటారు, చూపిస్తే ఇలా అంటారు, ఎందుకు oddగా ప్రవర్తిస్తారు, 

అవునులే దీపు ఆడవాళ్ళు ఆడ్ గానే ఉంటారు, అ అధికారం, ఆ ఆడది, అ అహంకారం, ఆ ఆధిపత్యం, ఆ ఆవేశం


దీపు ; అ అట్లకాడ, అ అప్పడాల కర్ర


వంశీ: ఆగు దీపు , అ అందం, అ ఆయుష్వర్యం

దీపు : అది అ కాదు ఐ ఐశ్వర్యం 

వంశీ : ప్రాసలో ప్రాస, యాసలో యాస.

దీపు : చాలు చాలు గాని, పన్నీరు ,ఉల్లిపాయలు రెడీ గా? హా రెండు క్యారెట్ లు కూడా తురుము.

వంశీ: చాలా ? లేక కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, దోసకాయి , నా తలకాయ కూడా తురుమాలా?


 టాప్ మని శబ్ధం అప్పడాల కర్రతో


వంశీ : అబ్బా దీపు నీకు నేను ప్రేమతో తాజ్మహల్ లాంటి బిల్డింగ్ కట్టిస్తే, నువ్వు నా తల మీద బుడప కట్టించావా


దీపు : తాజ్మహల్ ఎక్కడ, ఈ ఇళ్ళు ఎక్కడ


వంశీ : తాజ్మహల్ ఆగ్రాలో, మన ఇళ్ళు బాలపూర్లో


దీపు : చాలు


వంశీ : మరి లేపోతే ఏంటి , షాజహాన్ తన అయిదవ భార్య ముంతాజ్ కి కట్టించాడు, నువ్వు ఇంకా....


దీపు : ఓ కోర కోర చూపు చూసింది


వంశీ : ఆ అంటే అది, నువ్వు .... నాకు.... కృష్ణుడు లాంటి తొమ్మిది భార్యలతో సమానం. 


దీపు : (పన్నీర్ లిఫాఫా ఉడికే నూనెలో కాలుస్తూ) చూసావా నూనె ఉడుకుతుంది


వంశీ : ఐతే తొందరగా కాల్చేయి, అయినా తాజ్మహల్ తాజ్మహల్ అంటారు, అది భవనం కాదు దీపు సమాధి, నీతో నేను ఇంకా వందేళ్ళు గడపాలి


దీపు : అందుకే గా వంటింట్లోసమది చేశావ్ 


వంశీ : ఛా ఛా అవేం మాటలు దీపు, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళ కలలు నిజం చేసి, మన కలలు నిజం చేసుకోవాలి, అంతవరకు నేను నీలో , నువ్వు నాలో తప్ప ఈ నేలలో సమాధి కాము దీపు


దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది


దీపు: వంశీ ఐపోయింది పన్నీర్ లిఫాఫా, అర్జెంటుగా రెండు ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసేయి,, ఓర్పు అయిపోయింది నాకు.

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం