జీవితం 2

 ఒంటరినెపుడు కాను నేను

ఎవరికీ ఏమీ అవని బంధువును నేను

దాహమైతె దోసిట్లో నీరుని

దూరం అనుకుంటే అందని సెలయేరుని


ఒంటరిని కానేపుడు ...


గమ్యం లేని అనంతం గగనం

కోరిక లేని నిరాడంబరం నా జీవితం

సాయమే అందితే ధన్యోస్మి అనుకుంటా

సమస్యే ఎదురైతే సవాలుగా ఎదురుకొంట

ప్రశ్నలనె రెక్కలు తొడిగిన విహంగ గమనమిధి

మరో ప్రయణంకై నిలిచిన మజిలీ నాది


ఏకాకిని అసలే కాను...


ఆలోచన చేయని చూపు పసిపాపది

నిర్ధారణ తెలియని స్నేహం నాది

నిగూఢ నిషబ్ధంలో స్వరాలను వింటున్న

నిమగ్నమైన జీవితం నాది, కదపకంటున్న

నిరీక్షణలకి వేచి చూడని అన్వేషణ నాది

ఓటములేరుగని అనుభవం సారం ఇది


ఒంటరిని కానెపుడు

ఎకాకిని అసలేకాను

శృష్టి లయను , ప్రకృతి లయను , అంతు చిక్కని మాయను

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం