యెంకి పాట

 మామ చందమామ నాఎంకి యాడాపోయినది 

నా మల్లి మళ్ళెప్పుడొస్తది,

మొబ్బులో ముద్దేటి మత్తులొ తోసినాది 

మళ్ళొస్తా అని పొద్దుపొద్దునే మాయమైనాది 


ఎంకి యాడాపోయినవే ,మల్లి మళ్ళెప్పుడొస్తావే 

మామ ...(1)

గోదారల్లే నవ్వుతాది , పల్లె పాటల్లే మాట్లాడతాది ,

కృష్ణమ్మా ఒడ్డున అల్లుకున్న కొబ్బరి ఆకుల్లా జడేస్కుంటాది ,

నది నడిబొడ్డున సూరీడు పూసిన రంగుల్లా మెరుస్తాది ,

చంద్రయ్య నాయెంకిని చూసావా నువ్వు 

మారేపల్లె మల్లిరా అది 

మాపల్లె పాటల ఎంకిరా అది 



 సలవమజ్జిగ పులుపెక్కి పోయినదే 

మల్లి ఓ ముద్దిచ్చిపోయే 

మామ (1)...

జాబిల్లి సిగ నుండి జారిన సన్న జాజిరా అది 

సిగ్గేస్తే మబ్బుచాటుకెళ్లే ఎన్నెలమ్మర అది 

సుక్కలో పెద్ద సుక్క, పక్కేసుకునే ఏల జంటకొచ్చే నెలవంక 

చంద్రయ్య నామల్లిని చూసావా నువ్వు 

సీకట్లో మినుకు రవ్వరా అది 

సందెపొద్దున నవ్వే సంపంగిరా అది 


కుండబువ్వ ఎండిపోయినాది ,మల్లి వచ్చి ముద్దెట్టిపోయే 

ఎంకి యాడాపోయినావే , మల్లి మళ్ళెప్పుడొస్తావే

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం