జీవితం
తీరమన్నది లేని పవన సాగరం ఈ విశ్వం
స్వార్థంమన్నది చోటు లేక గడిపెయ్ ఈ జీవితం
ఇందనమవసరమెరుగని ప్రయాణం
అలుపెరుగక అనంతమై నిండిపో ఈ ప్రపంచం
.........
కలిసే ప్రతి మనిషీ ఒక పాఠమేగా
కాదని వెనుదిరిగితె ఓటమెగా,
చెలిమి కోరి చేరువైన బంధం వరమేగా
భారమని దూరమైతే నేరమేగా,
సాయమడిగే చేతులన్నీ నిస్సహాయత కాదు
ఆదుకున్న హృదయాలకేపుడు ఆపద రాదు
సాగిపో నేస్తం , ఆగనీకు ప్రయత్నం
గెలుస్తే వెలుగౌతావు ,లేదా మహా అయితే చీకట్లో నిదరోతావు
.......
కట్టిన ప్రతీ నావ ఒడ్డును చెరేందుకెగా
ప్రమాదమని పడకేస్తే జన్మ స్థూలమేగా,
చీమాచెట్టు అణువుఅంబరం తనలో భాగమేగా
నేనెవరినని విత్తు పెరగక జీవం సవమేగా,
సాధించేదేముంది జీవితంలో చేయూత తప్ప
సంపదంటు ఏముంది పంచే ప్రేమేగా గొప్ప
సాగిపో నేస్తం, విడువక సంకల్పం
సాధిస్తే ఉరెగుతావ్,లేదా మహా అయితే ఓడి ఉదాహరనౌతావ్
Comments
Post a Comment