జై జవాన్ - జై కిసాన్

 నెత్తురొడ్డి ప్రాణం కాపాడేది సైన్యం

చెమటోడ్చి కడుపు నింపేది సేద్యం


పాలిచ్చిన రొమ్ముకే బువ్వ పెట్టావా రైతున్న

పుట్టుకనిచ్చిన అమ్మకే రక్షణవైనవా సైనికన్న


ఆకలేస్తే కానీ నిన్ను అనుకోను, ఆపదోస్తే కానీ నిన్ను తలుచుకోము

తెలియనోల్లకి బంధువై బతుకునిచ్చార మీరు


జై జవాన్ జై కిసాన్

బోలో జై జవాన్ జై కిసాన్

రక్తం మరిగేలా బోలో జై  జవాన్ జై కిసాన్

దిక్కులు దధ్చరిల్లెలా బోలో జై జవాన్ జై కిసాన్


పొలిమేర కాడ నాగలితో రైతన్న

సరిహద్దు కాడ కాపలాగా జవానన్న


బిచ్చగాడిలా బతుకుతవు, నువ్ బిచ్చమేస్తెనే మా బతుకు రైతన్న,


కునుకు తీయవు,కన్ను మూయవు, కంటికి రెప్పలా కాస్తవు జవానన్న


జై జవాన్ జై కిసాన్

బోలో జై జవాన్ జై కిసాన్

జోర్సే బోలో జై జవాన్ జై కిసాన్

జిందా హోనే తక బోలో జై జవాన్ జై కిసాన్


దేశమే మీ స్వార్థం,

దేహమే మీ అస్త్రం,


తీర్చలేని రుణం గుర్తు పెట్టుకుని

ధన్యోస్మి అంటూ బతుకుతాం

జై జవాన్ జై కిసాన్

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం