పల్లెటూరు

 సురీడు సురీడు ఏలాయెర ఈనాడు

ఒరే సురీడు మా దేవుడు

నువ్వు రాందే నిదుర లెగడురా మా బుజ్జాడు



పెంట నీళ్లు జల్లే మాయమ్మ , అడుగు సూసి వెయ్యరో జాగ్రత్తరోయమ్మ

గుడిసె ముందే ముగ్గుల ఆకాసం , రాతిరి ఒదిలిపాయిన సుక్కలతో గొబ్బిల్ల సింగారం


శివుడికేమో గంగా జలం , మాకేమో కుంకుడి రసం

పొయ్యి మీద ఏనీళ్లు , మా సిన్నోనికి నూరేళ్ళు 


నాగలెత్తె నాగయ్య , బండి ఎత్తే బసవయ్య 

ముస్తాబయ్యే సినయ్య, అల్లరి పిడుగులు సూడయ్య

అలుపొచ్చిన అయ్యలకు రాగి ముద్ద , సెట్టు నీడ

ఆకలేసిన అల్లరోల్లకు గోరు ముద్ద , అమ్మ తొడ

ఇంటింటా ఇదే తీరు , మా పాణం మా ఊరు

..........


సుర్రు సుర్రంటున్న ఎండల్లో, సల్ల సల్లగున్న బావి ఈతలు

కడుపు నిండే దాకా తాటీ నుంజలు,అవి బండి కట్టి చేరువెంబట ఆటలు


దూడ పిల్లనీనే మా పిన తల్లి , పెళ్లి ఈడుకొచ్చే పక్కింట్లో సెల్లి

ఊరంతా పండగ పండగ,ఇంట్లో కూడెందుకు దండగ


సైకిలెక్కొచే ఆకాశరామన్న, ఉత్తరాలు తెచ్చే నయన

హరిలో రంగ హరి కత, యింటూ తోంగుంటిమి కదా

ఓ పూట మామిడికాయలు, మరోచోట చింతకాయలు

పండిన ఒడ్లే మా దుడ్లు, వాన మట్టి మా కనుగుడ్లు 


రామ సక్కని సీత మా ఊరు, సూడ సక్కని పైరు మా ఊరు

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం