జీవితం 1

 కన్నులకు చూపు తోడు కాదా

చూపు లేకపోతే చీకటి నీ చెలిమి కదా

దీపం వెలగాలి అన్న చీకటి ఉండాలి కదా

ఎపుడూ అనుకోకు నువ్వు ఒంటరి అని....


చ 1..

ఎంత ఒడిసిపట్టినా బరువనుకోని బాధ్యత తత్వం భూమిది


ఎంత ధారపోసినా తరగదనుకునే త్యాగ గుణం మేఘానిది


బాధలు చెప్పుకోని స్నేహం ఇరువురిది


సంతోషాలు పెంచుకునే అనుబంధం అది


చ 2..

దారి తప్పిన ధారకు తనువును సైతం పణంగా పెడుతుంది మట్టి


కాళ్లు లేక కదలిక తెలియని ఆకుకి నాట్యం నేర్పిస్తుంది పవనమే 


మాటైనా చెప్పకపోయినా చేసిన సాయం ఒకరిది


క్షణమైనా పరిచయం అవసరంలేని స్నేహం మరొకరిది


కన్నులకు....

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం