కవిత్వం - కవి తత్వం
మండుటెండలో నీడనిచ్చే చెట్టుకి తోడు ఎవరని రొమ్ములు గుద్దుకుని రోధించేది - కవి హృదయం తడిసి ముద్దయి విరబోసుకున్న ప్రకృతి యవ్వనమంత తన కళ్ళకే సొంతం అనుకునేది - కవి స్వార్థం పౌరుషంగా చెప్పుకునే దేశ గొప్పతనం ,దయనీయమైన దారిధ్యం తానొక్కడె వివరించగలడు అనుకేది - కవి గర్వం భావుకతలు ఉఛ్ఛ్వాసలై,భావాలు నిస్స్వాసలై అడుగడుగు తపనతొ సాగలనుకునేది- కవి జీవితం తనకంటూ ఒక గుర్తింపు లేకపోయినా, తనువుకంటూ గూడు లేకపోయినా ,తన తత్వం ప్రకటించాలి అనుకునేది - కవి ధ్యేయం బాధ ఎరుగని గాయమై , రక్తం ఉడికించే విప్లవమై ఒక హృదయాన్ని తట్టి లేపాలి అనుకునేది - కవి యుద్ధం