రుధిర సిర

 ఈనిన మేక పిల్ల మొదటి సారి ఆకలేసి తాగుతున్న పాలంత కల్మషం లేని బావుకతతో నిండుగా ఉంది ఆలోచన


తెల్లని రాళ్ల ఏడారిలా కర్కశంగా జాలి లేకుండా నిజం మాట్లాడుతోంది మనస్సు


పదిహేను వందల డిగ్రీల ఉష్ణోగ్రతల వేడితో భైరగినై చేతిలో పట్టుకున్న గుండె కలం నుండి ఉడుకుతోంది లావాలాగ సిర


ఆ వేడి సిరలో మునిగి కాలుతున్నా కరగనట్లు నిలుచున్నాడు కవి


కాలుతున్న ప్రతి నరం, ఆవిరౌతున్న ప్రతి రక్తపు బొట్టు ఆకాశానికి చేతులు జాపి అడిగింది , భూమినంత గొంతుగా చేసుకుని అరిచింది 


తన నిజానికి కుల జాతి నీతి బేదం లేని కత్తిలా వివక్ష లేకుండా ప్రతి హృదయాన్ని ఖండించే అక్షరాలు కావాలని

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం