ప్రాణం విలువ

 నేనడిగా నీ ప్రాణం విలువ ఎంత అని


చెప్పాడు 


ఓ కుర్రకుంక వాహనం మీద వెళ్ళే నూట ఇరవై వేగమంత అని


చెప్పాడు 

ఓ యువ కళేబరం ఓ సంక్రాంతి పతంగి కోసం, కోడి పందాల కోసం, పేకాట ముక్క కోసం కోట్లాడుకున్న వాడి గర్వమంత అని


చెప్పాడు 

ఓ వెధవ జుట్టు చెరిగిపోతుందని  శిరస్త్రాణం ధరించక, ఒంటి చేత్తో వాహనం నడుతు తాగుతున్న ఆ గాజు సీసా అంత అని


నేనడిగా నీ ప్రాణం విలువ ఎంత అని


చెప్పాడు

ఓ సైనికుడు కోట్ల మంది ప్రాణాలు కాపాడే తన కర్తవ్యమంత అని



చెప్పాడు

ఓ కూలివాడు తనలో నెత్తురంత చెమట చిమ్మి సంపాదించిన తన రోజు కూలి నోటంత అని


చెప్పాడు

ఓ రైతు ఎండకి ఎండీ, వానకి తడిసి, చలికి వణికి చెమటతో భూమిని తడిపి కోసిన తన కోత స్వచ్ఛతంత అని

Comments

Popular posts from this blog

మాతృత్వం - పితృత్వం

కవిత్వం - కవి తత్వం