కవిత్వం - కవి తత్వం

 మండుటెండలో నీడనిచ్చే చెట్టుకి తోడు ఎవరని రొమ్ములు గుద్దుకుని రోధించేది - కవి హృదయం


తడిసి ముద్దయి విరబోసుకున్న ప్రకృతి యవ్వనమంత తన కళ్ళకే సొంతం అనుకునేది - కవి స్వార్థం 


పౌరుషంగా చెప్పుకునే దేశ గొప్పతనం ,దయనీయమైన దారిధ్యం తానొక్కడె వివరించగలడు అనుకేది - కవి గర్వం


భావుకతలు  ఉఛ్ఛ్వాసలై,భావాలు నిస్స్వాసలై అడుగడుగు తపనతొ సాగలనుకునేది- కవి జీవితం


తనకంటూ ఒక గుర్తింపు లేకపోయినా, తనువుకంటూ గూడు లేకపోయినా ,తన తత్వం ప్రకటించాలి అనుకునేది - కవి ధ్యేయం


బాధ ఎరుగని గాయమై , రక్తం ఉడికించే విప్లవమై ఒక హృదయాన్ని తట్టి లేపాలి అనుకునేది - కవి యుద్ధం

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ