మాతృత్వం - పితృత్వం

 నాలుగేళ్ళ దాంపత్య జీవితం వారిద్దరిది. ఇంకా పిల్లలు లేరా అంటే , కొత్తగా పెళ్ళయింది కదా అనేటంతగా త్వరగా సాగిపోయింది జీవితం వాళ్ళది. ఇంకేం కొత్తగా పెళ్ళి, కొత్తగా అంటే మహా ఐతే ఆరు నెలలు అని ఎవరైనా అంటే మాకు మాత్రం నిన్ననే పెళ్ళయింది అనట్టు ఉంది అనేవారు. తుమ్ములు దగ్గులు లాగా అప్పుడపుడు చిన్న గొడవలు వచ్చినా ఆనందంగా సాగిపోయే ఆరోగ్య జీవితం. ఒక్క సంతానం లేదు అనే బెంగ తప్ప అచ్చమైన ఉగాది పచ్చడి లాగా ఉండేది వారి జీవనం.


అతనికి వినికిడి లోపం,అతడి ముప్పై ఐదేళ్లకు కుదిరింది ఇద్దరి పెళ్ళి, తోడు కోసం వేచి చూసిన తన పదేళ్ళ ఒంటరితంలో ఒక్కసారిగా ఒక ఉల్కయన లాగా వచ్చేసి చెరిగిపోని ముద్ర వేసేసింది తనలో. పెళ్లైన నాటి నుండి రోజూ కంటి రెప్పల కొట్టుకోడాల కన్నా ఎక్కువ ముద్దులు, దద్దోజనం లోని పోపు కన్నా ఎక్కువ ఘాటు కౌగిళ్ళు . చిలుక గోరింక, ఎరుపు గోరింట సంసారం. వినికిడి లోపం ఉందని తెలియకుండా చూసుకునేది ఆమె.


తన తనువు నుండి భాగమైన ఒక శిశువు కావాలని ఆమె, తన మనస్సులా మెరిసే ఒకరిని కనాలని అతను ,,వేచిచూశారు.కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇద్దరికీ నార్మల్ ప్రెగ్నెన్సీ అవలేదు. ఒక ఏడాది వరకు IVF చికిత్స తర్వాత వారి కల నిజమై పండంటి లక్మి కటాక్షించింది. వారి ఆనందాలకి కొలతలు లేవు. 


మూడు నెలల గడిచాక పాప చేతి కింద రూపాయి బిల్లంత మచ్చ కనపడింది, ఎలా వచ్చిందా అని ఆమె ఆలోచనల్లో తలమునకలైంది. అత్తింట్లో అందరినీ అడిగింది ఎవరికైనా అలా ఉందా అని , లేదు అన్నారు. పాప కూడా ఇద్దరి పోలికలు లేకుండా పుట్టింది. ఆమెకు ఏదో అనుమానం మొదలైంది. అది నిజమే అయి ఉంటుందా, ఏమైనా జన్యువుల మార్పిడి అయి ఉంటుందా IVF లో అని, ferty centre కి వెళ్ళింది. అందరూ నవ్వుతూ పలకరించి అభినందనలు తెలిపారు అక్కడ , ఒక్క మగ నర్స్ తప్ప. తనని చూసి ఏదో మొహంతో తొందర తొందర గా నడిచి వెళ్ళాడు నర్స్. ఆమెకి గుండెల్లో ఒణుకు పుట్టి అతడి వెనకాలే వెళ్ళి చొక్కా పట్టుకుని లాగింది. చెప్పు ఏం చేశావ్, ఎందుకు చేశావ్ అని.నేనేం చేయలేదు అని ఆ నర్స్, ఇంత చూసాక ఆమాత్రం చెప్పలేను అనుకున్నావా,చెప్పు లేక పోతే పోలీసులతో పని పడుతుంది అని. భయంలో నర్స్ నిజం చెప్పాడు. ఒక్క సారిగా తన ప్రపంచం అంత అంతమైపోయిందా అనే భ్రమలోకి వెళ్ళింది. ఒంట్లో రక్తం అంత భూమిలోకి కారిపోయినట్లు కుర్చీలో కూలబడిపోయింది.


ఇంటికి వచ్చాక అతడు పాపతో సంతోషంలో తేలిపోతూ ఆడుకుంటున్నాడు, ఎలా అడగాలి అతడిని, మాటలు రావట్లేదు. నాలుగేళ్ళ నమ్మకం ఎలా ఎలా ఆమెకి దిక్కు తోచలేదు. ఆమెను చూసి ఏదో జరిగింది అని తెలిసిపోయింది అతడికి. ఏమైంది రా ఒంట్లో బాలేదా అని తల నిమిరాడు. ఆమె ఏమి చెప్పలేదు. ఆ పూట ఆమె ఏమి తినలేదు. అతడికి ఏమి జరిగింది తెలియలేదు. అడిగాడు ఏమైంది బుజ్జి ఎక్కడికెళ్ళావ్ అడిగాడు. తను ఒక పక్క భయంతో ఇంకో పక్క అనుమానంతో, మరో పక్క కోపంతో ferty centre నుండి వస్తున్న అంది. అతడి గుండె ధడేల్ మంది. 


ఆమె : చెప్పు ఎందుకు చేశావ్. నీ మీద ప్రేమ నమ్మకం, కోపం ద్వేషంగా మారే లోపు చెప్పు 


అతడు : వేయి సంవత్సరాలు కదలిక లేని రాతి లాగా నిలబడిపోయాడు


ఆమె : నాలో నుండి పుట్టింది. మనది కాదు అని వార్త తెలిసాక సగం చచ్చిపోయాను. ఒక్క క్షణం ఆలస్యం చేయకు మొత్తం చచ్చిపోతాను. ప్లీజ్ చెప్పు ఎందుకు చేశావ్ 


సప్త సాగరాలు అతడి కళ్ళలో నిండిపోయాయి, నవగ్రహాల బరువు అతని గుండెల మీదకి ఎక్కింది. తన బాధ ఎలా చెప్పాలి, ఆ నిజం లో ధర్మం ఉంది అని, ఆ ధర్మం నిజం అని ఎలా చెప్పాలి. ఒక బిడ్డకోసం పరితపించి బతికిన ఆడదానికి అతడు చేసిన పని సరైనది అని చెప్పడానికి మాటలు ఎక్కడ నుండి తేవాలి అర్థం కాలేదు.ఒక ఏడాది మందు మాత్రలతో కడుపు కోత, చేదు నోరు, తొమ్మిది నెలల గర్భం బరువు, ప్రసవ వేదన వీటిని మించిన నిజం లేకపోయిన తను చేసింది తన దృష్టిలో ఒప్పు అని ఎలా చెప్పాలి ఆమెకి.పదాల సంపద కలిగిన కవి చెప్పలేడు, శాస్త్రాలు చదివిన పండితుడు చెప్పలేడు. ఒక్క తను తప్ప , ఒక భర్త తప్ప.


ఆమె : నొప్పి భరించలేక పోతున్నాను చెప్పు ప్లీజ్


అతడు : నువ్వు విన్నది నిజమే, నేనే చేశాను ఆది ( తన ఒంట్లో నరాలన్నీ దాచుకున్న నిజం , ఆ నరాలన్నీ తెగేలా చెప్పేశాడు)


ఆమె : ఎందుకు చేశావు ఏం పాపం చేశాను నీకు. ఒక పక్క ప్రెగ్నెన్సీ రాని పాపం దేవుడు చేస్తే ఇంకో పక్క నీవి కానివి నాకిచ్చి (sprems) మనది కానీ పాపని ఇచ్చావా?


అతడు : లేదు లేదు అలా అనకు ఆ పాప మనది నీలో నుండి పుట్టింది , నా కలలు అంత కూడబోసుకున్నది. 


ఆమె : ఆపు, ముందు ఎందుకు చేశావు ఈ పని 


అతడు : నా సమస్య మన పిల్లలకి రాకూడదు అని


ఆమె ; ఏంటి నీ సమస్య, నీ వినికిడి లోపమా , ఏ అది ఎంత మందికి లేదు. నీకెప్పుడైనా ఆ లోపం ఉంది అనేలా ప్రవర్తించానా .... హా (అతడి చొక్కా పట్టుకుని గుండెల మీద ఏడ్చి ఏడ్చి అతడి గుండెల వేడిని ఆమె కన్నీటితో ఇంకా వేడెక్కించింది)


అతడు : బుజ్జి అలా అనకు నీతో ఉన్నప్పుడు నాకు వినికిడి లోపమే కాదు, అసలు నువ్వు దక్కాక కోరికలన్నీ ఆవిరై, ఈ జన్మకి ఇది చాలు అనుకునేలా చేశావు. నువ్వు రాక ముందు నా బాధల గురించి ఆలోచించి ఇలా చేశాను.


ఆమె కొంచం తన తల పైకి ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. అపధపు ఛాయలు కనపడని ఆ కళ్ళు చూసి ప్రేమ బాధ కలబోసిన కౌగిలితో అతడిని వాటేసుకుంది.


అతడు : నాకు చిన్నప్పటి నుండి లేదు వంశ పర్యాపర్యంగా వచ్చిన లోపం. ఆ తెలియని వయసులో అది లోపం అనిపించలేదు. స్నేహితులు,సందడి లో గడిచిపోయింది. పదవ తరగతి అయిపోయాక కొత్త జీవితం , తెలియని స్నేహితులు కొత్త పరిచయాలు. కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు. తరగతి గదిలో పాఠాలు వినపడలేదు. నోట్స్ రాసుకునేపుడు పక్కన ఎవరు లేరు. ఒంటరి తనం. చెప్పుకోడానికి ఎవరు సహకరించలేదు. చెప్పిన యెహ ఏం కాదు పట్టించుకోకు అనే వారే కానీ వినేవారు లేరు. మొదటి సంవత్సరం చాలా తక్కువ మార్కులు , తనకన్నా తక్కువ మార్కులు వచ్చే వారి కన్నా తక్కువ మార్కులు. బాధ. సినిమాలకి వెళ్దాం అంటే వినపడవు,, స్నేహితుల గుంపు లో ఉంటే వారికి వారి మాటలే కానీ నాకు వినపడవు బాధ మరియు బోరు, నాకు ఆ ఆనందం కావాలి

నాకు ఆ స్వేచ్ఛ కావాలి, ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అనిపించేది. అరే ఒకరికి వినపడదు అన్నపుడు సైగలు చేసి చూపించవచ్చు, వ్రాసి చూపించవచ్చు అలా అందరి ముందు అంత గట్టిగా అరిచి నవ్వుల పాలు చేస్తారు, సినిమాల్లో కూడా వినపడి వాళ్ళని ఒక కామెడీ యాంగిల్ లో చూపిస్తారు. వారి బాధలు చూపించరు. 


ఆమెకి తెలియకుండా ఆ కోపం కంటే అతని మీద జాలితో ఒక కన్నీరు కారింది.


అతడు : ఉద్యోగం కోసం అన్ని చక్కగా ఉన్నవాళ్ళకి దిక్కు లేదు. ఇంకా నాకు ఎన్ని అడ్డంకులు. ఉద్యోగం వచ్చాక మొదటి సారి నా స్నేహితులు నా కుటుంబం నా ఊరు వీటిని విడిచి వెళ్ళ. అందులోనూ బ్యాంకులో పని. ఎన్ని సార్లు చెవులు పెట్టాలి వాళ్ళకి, విసుకుంటారు, చులకన చేస్తారు. నవ్వుతారు, ఇవన్నీ నా బిడ్డకు ఇవ్వాలని నేనెలా అనుకుంటా. నువ్వు అనుకోవచ్చు ఇలా చాలా మంది ఉన్నారు అని, వాళ్ళతో నాకు సంబంధం లేదు నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తా.తల్లి స్వార్థం తల్లిది ఐతే నాన్న స్వార్థం బాధ్యత నాన్నది.


ఆమె ; తను మన బిడ్డే కదా ? అవును అని చెప్పు..


అతను : ముమ్మాటికి. నువ్వు వదిలే శ్వాస, నీ కంటి కదలికతో సహా నీలోని ప్రతి అణువు మనదే. 


ఆమె : నన్ను క్షమించు


అతడు : నన్ను ఈ జన్మకే కాదు మరు ఏడు జన్మలకి క్షమించు


ఇద్దరు కౌగిలించుకుని ఒకరి ప్రేమలో ఒకరు, ఒకరి నమ్మకంలో ఒకరు, ఒకరి ప్రశాంతతలో ఒకరు మునిగిపోయారు.


ఇంతలో పాప చిన్న అరుపు అరిచింది.

ఇద్దరు పాప పాదాలు ముద్దాడి మమ్మల్ని క్షమించు అన్నారు. పాప నవ్వేసి ఇద్దరిని దీవించేసింది ( పిల్లలు దేవుళ్ళతో సమానం) 


మాతృత్వం, పితృత్వం అంటే మనకి పుట్టిన వాళ్ళ మీదే కాదు, పెంచిన ప్రేమ, ప్రేమతో కూడిన బాధ్యత.

Comments

Popular posts from this blog

నీ ఆనతి శివ

కవిత్వం - కవి తత్వం