దాచుకునేదే నీ రూపమని దర్జాలకి పోతవు
నే మోజుకున్నదంతా వ్యర్థమని దోచుకుని పోతవు
మూడుకనులున్నా కన్నప్ప కన్ను కోరితివి
నిన్ను కొనియాడిన రావణుని కడుపు కోస్తివి
నిన్ను నమ్ముకున్న భస్మాసురుడిని నిలువునా కాల్చితివి
అందని అంతగాడివి, అడిగితే ఇంతగాడివి
శోకంలో సొంతగాడివి,సామి నువ్వో వింతగాడివి
ఈడనుంటవు ఆడనుంటవు, దొర నిను వీడి నేన్యాడనుంటను
నా కథ నీ కాడికే రా, నా కట్టే నీ కాటికే రా
Comments
Post a Comment