నీ ఆనతి శివ

 నీ ఆనతి నా జీవిత గతి

నీ స్తుతి నా పదాల యతి


నెలవంకను మించు తళుకుల పార్వతి

నీ సమేతంగ చూచి తరించే జగతి


కైలాసపతి నీవై, కైవల్యప్రాప్తి నీతోనై

గరళము సేవించి, జగమును రక్షించి

అసురులను గావించి , వారి అహమును శిక్షించి

జాతులకతీతమైన పశుపతివైతివి

జీవులకు పవిత్రమైన జగపతివైతివి


ఏ దిక్కు నుండి వస్తివి దిక్పాలక

నా దిక్కు నీవైతీవి జగన్నాయక 


పంచాక్షరీ నీది,విరూపాక్ష నీవై

భిక్షమును సేవించి, నారక్షణ గావించి

మొదలులేని గంగనిచ్చి, తుదకు నన్ను నీ చెంతచేర్చి

మంత్రతంత్రరూపమైన ఆదినాదమిచ్చితివి

శుద్ధశుభ్రసర్వశాస్త్రయంత్రమైన రుద్రబీజాక్షరినిచ్చితివి

Comments

Popular posts from this blog

కవిత్వం - కవి తత్వం