సంసారం సాహిత్యం
ఆ రోజు రెండో శనివారం కావడం మూలాన వంశీకి సెలవుదినం , కొంచం ఆలస్యంగా ఏడింటికి నిద్రలేచి నిమ్మళంగా టీ తాగేసి టీవీలో పాటలు పెట్టారు ఇద్దరు (వంశీ , దీపు). దీపు టీవీ రిమోట్ తీసుకుని తనకి బాగా ఇష్టమైన న్యూయార్క్ నగరము నిదురోయే వేల పాట పెట్టీ వింటోంది, వంశీ దీపుని చూస్తూ ఉన్నాడు. పాట అయిపోయాక
దీపు : వంశీ నువ్వు కూడా ఇలా నా గురించి ఒక పాట వ్రాయవ అనడిగింది
వంశీ : తప్పకుండా ట్రై చేస్తా దీపు.
ఓ కన్నె వెన్నెల నా కన్నులు నిన్నే కలవరిస్తూ
నన్నే మరచి నిన్నే గాంచిన నా మనసా ఆనందమస్తు
దీపు : మస్తు ఏంటి
వంశీ : ఇది మస్త్ మస్త్ కాదు దీపు మస్తు అంటే అలాగే ఉండు అని.
దీపు : కొంచం మామూలు పదాలు వాడి వ్రాయి వంశీ
ఇంతలో యూట్యూబులో పాట అయిపోయి తరువాతి పాట ఖడ్గంలో ' నువ్వు నువ్వు ' మొదలైంది
దీపు అమాంతం సౌండ్ పెంచేసింది .
దీపు : ఏం వ్రాసారు వంశీ సిరివెన్నెల గారు ఈ పాట అని గాలిలోకి రెండు ముద్దులు విసిరి ఒక దణ్ణం పెట్టింది.
వంశీ : పాట చాలా బాగుంది కానీ ఇక్కడ ఫీమేల్ డామినేషన్ బాగా కనపడుతుంది దీపు.
దీపు( ఆశ్చర్యంగా ) : ఏంటి!
వంశీ : అవును దీపు అసలు పాట అంత ఆమె మాటే కానీ అతని మాట వినద? దానికి తోడు అతని మీదా చాడీలు, ఆరోపణలు గాయం చేసిన అన్యాయం నువు, శత్రువు నువ్వు, ఆమెని వేధించే వాడు, చివరికి నా అంతం నువ్వు అని ఇవి ఈ జన్మకి చాలు అనక మరుజన్మ నువ్వు అంటుంది
దీపు : (with awe stuck face) ఒక ఆడదాని మనస్సు,ప్రేమ, ప్రియుడి మీద పిచ్చిని ఇంతగా వ్యక్త పరిస్తే అది నీకు ఇలా అనిపించిందా.అంతేలే మీ మగవాళ్ళకి మా ప్రేమ ఒక భారంలా అనిపిస్తుంది, మేము మాత్రం మీరే కావాలి మీతోనే ఉండాలి అనుకుంటాం.
వంశీ : ఆడది మగాడి బంధంలో బంధింపబడాలి, ఆ బంధింపులోనే స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటుంది, మగాడు స్వేచ్ఛనిచ్చే ఆడదాని ప్రేమ కావాలి అని కోరుకుంటాడు అన్నాడు ఓషో
దీపు : ఓషో అన్నాడు మీషోలో పెట్టాడో కానీ ఇంతటి దారుణమైన, పూర్తి భిన్నమైన క్రిటిక్ నేను నా జన్మలో వినలేదు,,,
వంశీ : ruthless criticism must be first eligibility of apponent in politics అన్నారు ఓ రాజకీయ సాహితీవేత్త karl marx
దీపు: అంటే ఇప్పుడు ఏంటంటావ్ నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తావా
వంశీ : రోజువారీ క్రమం తప్పకుండా మీరు చేస్తున్నారుగా రాజకీయాలు, పేరుకి మాత్రం రాజ అని నామమాత్రపు ఆవగింజ అంత తృప్తిని ఇచ్చి, మొత్తం రాణికీయాలు చేస్తారు,అయినా మీ ఆడవాళ్ళు ఆక్సిజన్ లేకుండా నిమిషం ఉండగలరు కానీ ఆర్గుమెంట్ లేకుండా క్షణం ఉండలేరుగా
ఇంతలో దీపు అమ్మ ఫోన్ చేశారు ,,,
వంశీ ఏదో వ్రాస్తూ : దీపు ఈ రెండిట్లో ఏది బాగుంది ' తాను నా శ్వాసల సాగరం ' 'తాను నా శ్వాసల సంగమం '
ఫోన్లో నుండి దీపు అమ్మ : సాగరసంగమం బాగుంది.
వంశీ : సరిపోయారు తల్లికి తగ్గ కూతురు. దీపు నీకు సాహిత్యం మీద పట్టు లేదు.
దీపు : సాహిత్యం మీద పట్టు తర్వాత ముందు ఆ సొరక్కాయి పని పట్టు సాంబార్ చేస్తా.
వంశీ : సంసారం ఒక చేదు రంగం, సంసారం ఒక సందిగ్ధం అని పాడుకుంటూ వెళ్ళాడు .
వంశీ ఒక్కడే దీపుకి ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ ఐస్క్రీం తింటూ ఉంటే దీపు కోపంగా చూసి : కాలీ కడుపుతో ఉన్న భార్యని పక్కన పెట్టుకుని అంత కక్కూర్తిగా ఒకడివే ఎలా తింటున్నావ్
వంశీ ( కూల్ గా) : ఐస్క్రీం తినడానికి కక్కూర్తి ఎందుకు దీపు కప్పు స్పూన్ ఉండాలి కానీ,అయిన కాలీ కడుపుతో వేడి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు తాగాలి ఆరోగ్యం అంటూ కప్పు కాలీ చేశాడు.
దీపు : భార్యకి పర్యాయ పదం తెలుసా ' అర్ధాంగి ' అంటే అన్ని పంచుకోవాలి అర్ధం అర్ధం,సగం సగం
వంశీ : అఘోరించావ్ గాని ఆమాత్రం నాకు తెలియదా, అర్ధాంగి అంటే అర్ధ + అంగి సవర్ణదీర్ఘ సంధి, లాగు కూడా పంచుకోమని చెప్పలేదు.so its about sharing only shirt,,means only few things must be shared, అర్థలాగంగి ఐతే అన్ని పంచుకోవచ్చు. అందుకే నీకు సాహిత్యం పట్టు లేదు అనేది.
వంశీ పాడుకుంటూ 'సాయం అడగక సేవ చేసితి శివా, భోగం కోరక భక్తి చూపితి హరా '
దీపు : నీ సేవతో ఆయనకి ఏం పని లేదు కానీ వచ్చి కాస్త వంటలో సాయం పట్టు పుణ్యం కట్టు.
వంశీ : ఇదేం తిరుపతి పొర్లు దండమా, శ్రీశైలం శివుడి స్తోత్రమా పుణ్యం కట్టుకోడానికి. ఆల్రెడీ నిన్ను కట్టుకున్నాక ఇంకేం .......
దీపు ఓ కొస్సటి చూపు
వంశీ : ఇంకే పుణ్యం నాకు అవసరం లేదు దీపు. వంద జన్మల పుణ్యఫలం నువ్వు..
దీపు: ఇలాంటి బూటకపు మాటల వల్లే శ్రీదేవిని శ్రీనివాసుడు , సత్యభామను శ్రీకృష్ణుడు కట్టి పడేశారు
వంశీ : yes దీపు సంసారం ఇస్ ఆల్ అబౌట్ సరసం , సాంగత్యం, సంగీతం, సాహిత్యం, సమ్మేళనం, ద్వంద్వ శరీరాల సంగమం. సాహిత్యో రక్షతి సంసారం రక్షితః , మాటలు బాగుంటే మర్యాద, మర్యాద ఉంటే మంచితనం, మంచితనం ఉంటే దాంపత్యంలో నిండుదనం.
Comments
Post a Comment