నువ్వు లేని సమయం
ప్రతీ ఉదయం నే చూసే తొలి చిత్రంగా నిన్నే చూడాలి
ప్రతీ రాత్రీ నే సేద తీరే చివరి క్షేత్రంగా నిన్నే చేరాలి
చెప్పుకున్న సరదాలే రోజంతా చెప్పుకుంటాం
ఎన్ని సార్లయినా కొత్తగా నవ్వుకుంటాం
నువ్వే జతనుంటే ఆనందాల చవితి
నువ్వే చెంత లేకుంటే కొలవలేని వెలితి
గడియారం గడపనే చూస్తోంది
నీ కాలి అలికిడి ఏది అని
దువ్వెన్నె కాచుకుని కూర్చుంది
నీ కురుల వసంతం ఎప్పుడని
పరుపేమో మడతలు లేక అలలు లేని కొలనులా ఒంటరి అయ్యింది
దుప్పటేమో మన కౌగిల్లు కానరాక
కునుకు మాని అలక చూపింది
ఆలస్యం చేయకు ఆరాటం తట్టుకోలేను
ఆటలాడకు నీ ఆలోచనలు ఆపుకోలేను
Comments
Post a Comment