ఎంకి పాట.
సూడొద్దు సూడొద్దు అంటూనే నా సూపు దాని సెంపకెక్కింది
నాకొద్దు నాకొద్దు అంటూనే నా మనసు దానితో లగ్గమెట్టమంది
ఓసి నా ఎంకి, లగ్గమెట్టేసుకుందామే
ఓసి నా పెంకి, మూడుముళ్లు ఏస్తానే
.....
కొమ్మెకి నువ్వు కాయ కోస్తా ఉంటే
కొబ్బరేసి బెల్లమేసి నువు కలుపుతా ఉంటే
కొంగు జారి నీ పొంగు పొంగినాది
ఖంగు తిని కన్నేసినానే నా ఎంకి
కోపమొచ్చి నువ్వు కస్సుమన్నావే నా పెంకి
నా ఎంకి నా మరదలు పిల్లా
నా పెంకి రావే సందేపొద్దుకళ్లా
.....
రాయలసీమ రాగిముద్ద నూ చేస్తా ఉంటే
గోదారి యాసలో నూ నవ్వుతా ఉంటే
బొబ్బర్లంక బొబ్బట్ల బుగ్గలో లొట్టలడుతుంటే
మనసారేసుకున్నానే నా ఎంకి
నన్ను పారేసుకున్నానే నా పెంకి
అత్తకు నే సెప్పుకుంటా
మామతో నే మొత్తుకుంటా
ఒట్టేసి బొట్టెట్టేస్తానే నా ఎంకి
కాళ్ళ ట్టేసి మెట్టలెట్టేస్తానే నా పెంకి
మనసెట్టి సూసుకుంటా, మల్లెపూలేసి మంచమేస్తా
మాపటేల ముసుగేస్కుందాం
ముసుగులో ముచ్చటేసుకుందాం
Comments
Post a Comment