యెంకి పాట...
కోపమంటే నాయెంకిది, తాపమంటే నాయెంకిదే
కోపంలో సోకంటే నాయెంకిది,
తాపంలో అందమంటే నాయెంకిదే
మల్లెపూలు తేలేదని అలిగింది బుంగమూతేసుకుని
ఎంకి సాల్లేవ్ కోపం, కట్టేయవే తాపం
కోపమంటే,,, (1)
నీకడదని కల్లు ముట్టి ఎన్నెలైందే
నీకోసమని పేకముక్కట్టి ఎన్నాళ్లయ్యిందే
ఊరిఅరుగు కబుర్లు మూటకట్టి పెందరాళే వచ్చా కదే
సంతలో తెల్లచీరె నీకోసమే కదే కొన్నది
మూరెడు పూలు తేలేదని కోప్పడ్డావే ఎంకి
ఆపవే ఎంకి నీ కోపం, సాలించవే ఎంకి నీ తాపం
కోపమంటే,,, (1)
నువ్వు మావా అనకుంటే నాకు బువ్వ దిగదే
నువ్వు రావా అనకుంటే కునుకు పడదే
అద్దం మీద స్టికెరు బిళ్ల, గూట్లో కాటుక నల్ల
కొక్కాని కాసిన నీ కొంగు, ఇంటిముందేసిన ముగ్గు
ఏది చూసిన నువ్వేనే ఎంకి
మూరెడు పూలు తేలేదని కోప్పడవే ఎంకి
ఆపవే ఎంకి నీ కోపం, సాలించవే ఎంకి నీ తాపం
కోపమంటే,,,
Comments
Post a Comment